పది మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలకు కెసిఆర్ వల

K Chandrasekhar Rao
హైదరాబాద్: అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలనే నిర్ణయం తీసుకోవడానికి ముందు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పెద్ద కసరత్తే చేశారని అంటున్నారు. నాలుగైదు మంది శానససభ్యులలు కాంగ్రెసుకు తగ్గితే ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వాన్ని కూల్చాలనే వ్యూహంతోనే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి సిద్ధమైన కెసిఆర్ తెలంగాణ ప్రాంతానికి చెందిన పది మంది శాసనసభ్యులకు గాలం వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఐదుగురు శాసనసభ్యులతో కెసిఆర్ మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా శానససభ్యులను కూడగట్టే బాధ్యతను ఆయన ఇద్దరు సీనియర్ శానససభ్యులకు అప్పగించినట్లు చెబుతున్నారు. ఉప ఎన్నికలు వస్తే పార్టీ టికెట్ ఇస్తామని, గెలిపించుకుంటామని కెసిఆర్ కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శానససభ్యులకు హామీ ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలుపు తమదేనని అంటున్న కెసిఆర్ సాధ్యమైనంత త్వరగా ఎన్నికలను ఎదుర్కోవడానికి ఉవ్విళ్లూరుతున్నట్లు చెబుతున్నారు.

కాగా, అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తాము గెలిచి తీరుతామని కాంగ్రెసు నాయకులు, మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెసిఆర్ ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కుంటామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసుకు అనుమతి లభించిన తర్వాత ఆలోచిస్తామని మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు. అవిశ్వాసం తీర్మానం ఎవరు పెట్టినా శృంగభంగం తప్పదని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రతిపాదిస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశైారు.

కుర్చీ కోసమే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తున్నారని రఘువీరా రెడ్డి అన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తాము చేసిన పనులు చెప్పుకోవడానికి అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. తమకు సంఖ్యాబలం ఉందో లేదో సభలో తేలుతుందని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు అవిశ్వాసం ప్రతిపాదించినా తాము నెగ్గుతామని ధీమాతో కాంగ్రెసు ఉంది.

ఈ ప్రభుత్వం పడిపోవాలని తమ పార్టీ భావిస్తోందని తెరాస శాసనసభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించకుండా నాన్చివేత ధోరణి అవలంబిస్తోందని, తెలంగాణ ప్రజలను పరిపాలించే అర్హత ఈ ప్రభుత్వానికి లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+