జగన్‌తో పార్టీ పెట్టించింది కాంగ్రెస్సే, కుమ్మక్కు: కెటిఆర్

KT Rama Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూపై తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు సోమవారం మండిపడ్డారు. తన భర్త వైయస్ రాజశేఖర రెడ్డి మృతిపై అనుమానాలు ఉన్నాయని చెప్పిన విజయమ్మ ఇప్పుడు కాంగ్రెసుకు మద్దతిస్తామని ఎలా చెబుతున్నారని ఘాటుగా ప్రశ్నించారు.

తన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అధికారమే పరమావధిగా భావించి విజయమ్మ మద్దతుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు. 2004, 2009లో రెండుసార్లు గెలిచిన కాంగ్రెసు 2014లో మూడోసారి అధికారంలోకి రాలేమేమోనని భావించి జగన్‌తో పార్టీ పెట్టించినట్లుగా తమకు అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

కాంగ్రెసుకు మద్దతిస్తామని చెప్పడం ద్వారా కాంగ్రెసుకు వ్యతిరేకంగా వారికి మద్దతు పలికిన ప్రజలను జగన్ పార్టీ మోసం చేస్తోందన్నారు. స్వప్రయోజనాల కోసమే వైయస్సార్ కాంగ్రెసు అధికార పార్టీతో కలిసేందుకు సిద్ధమవుతోందన్నారు. ఢిల్లీ కాంగ్రెసు, చంచల్‌గూడ కాంగ్రెసు, తెలుగు కాంగ్రెసులతో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొడుకున ముఖ్యమంత్రిని చేసేందుకు విజయమ్మ కాంగ్రెసుకు వంత పాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇది దిగజారుడుతనమే అని విమర్శించారు.

రోజూ కాంగ్రెసును దుమ్మెత్తిపోసే వైయస్ విజయమ్మ తన అల్లుడు, కొడుకును రక్షించుకునేందుకే మళ్లీ ఆ పార్టీతో కలిసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. అధికారం కోసం కాంగ్రెసు, జగన్‌లు కలిసేందుకు సిద్ధంగా ఉండటం దారుణమన్నారు. చంద్రబాబు తన పాదయాత్రలో గొంతు చించుకున్నా ప్రజలు నమ్మరన్నారు. బాబు కిరణ్ ప్రభుత్వం పైన అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెసుకు ఆయన ఆపద్బాంధవుడు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+