రోడ్లపై తిరగడం పద్ధతి కాదు: చంద్రబాబుపై నాగం

పాదయాత్రకు విరామం పలికి చంద్రబాబు శానససభా సమావేశాలకు హాజరు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు పుట్టెడు కష్టాల్లో ఉంటే శానససభలో కూర్చుని ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి రోడ్లపై తిరగడం పద్ధతి కాదని ఆయన అన్నారు. ప్రభుత్వ పరిస్థితిలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని నాగం అన్నారు.
బడ్జెట్ సమావేశాలకు సిద్ధం కండి..
శానససభ బడ్జెట్ సమావేశాలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధికార యంత్రాంగానికి సూచించారు. శానససభ, శాసనమండలిల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు వీలుగా కీలక అంశాలకు సంబంధించి కనీసం 20 ఏళ్లకు చెందిన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు.
అందుబాటులో ఉన్న మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో ఆయన సచివాలయంలో సోమవారం బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. శానససభ సమావేశాలు ముగిసేంత వరకు అధికారులు ఎవరు కూడా సెలవుల్లో వెళ్లరాదని ఆయన ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం ఫోన్‌లో మంత్రులకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. గత సమావేశంలో సమాధానాలు ఇవ్వని ప్రశ్నలకు తక్షణం సమాధానాలు పంపించాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications