జగన్ ఎఫెక్ట్: కెసిఆర్‌కి లైన్‌క్లియర్, కాంగ్రెస్ వెనుకడుగు!

K Chandrasekhar Rao - YS Jagan
హైదరాబాద్: శాసన సభ్యుల కోటాలో జరుగనున్న శాసన మండలి ఎన్నికల్లో ఆరో అభ్యర్థిని బరిలోకి దింపే విషయంలో అధికార కాంగ్రెసు పార్టీ వెనక్కి తగ్గింది! వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు తెలంగాణ సెంటిమెంట్ కారణంగా ఆరో అభ్యర్థి గెలుపు కష్ట సాధ్యమనే అభిప్రాయానికి వచ్చిన అధికార పార్టీ ఐదుగురు అభ్యర్థులతోనే సరిపెట్టుకుంది!

వీరభద్ర స్వామి, లక్ష్మీ శివ కుమారి, సంతోష్ కుమార్, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డిల పేర్లను కాంగ్రెసు అధికారికంగా ప్రకటించింది. ఈ రోజుతో ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ గడువు ముగుస్తుండటంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆరో అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆరో అభ్యర్థి కోసం పట్టుబట్టగా.. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వద్దన్నారు.

ప్రేమ్ సాగర్ రావు లేదా రఘురామి రెడ్డిని ఆరో అభ్యర్థిగా నిలబెట్టేందుకు కిరణ్ ఆసక్తి చూపారు. జగన్, తెలంగాణ ప్రభావం కారణంగా ఆరో అభ్యర్థి గెలుపు అనుమానంగా తయారయింది. దీంతో కిరణ్ ప్రతిపాదించిన ఇద్దరు పోటీలోకి దిగేందుకు ఇష్టం చూపలేదట. దీంతో బొత్స ఐదుగురు అభ్యర్థులకే బిఫారం ఇచ్చారు. ఆరో అభ్యర్థిపై వెనక్కి తగ్గటం వల్లనే బొత్స వారికి మాత్రమే బిఫారం ఇచ్చారంటున్నారు. అయితే, చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

ఇప్పటికే పలువురు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జగన్ వైపు వెళ్లారు. జగన్‌కు మద్దతిస్తామని వారు బాహాటంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు కోడ్ వర్తించదు. దీంతో మరికొందరు జగన్ అభ్యర్థికి ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణ సెంటిమెంట్ కారణంగా తెరాస అభ్యర్థికి కూడా ఓటు వేస్తారు. ఇన్ని సమస్యల మధ్య ఓటింగు కంటే ఏకగ్రీవానికే అధికార పార్టీ మొగ్గు చూపినట్లుగా కనిపిస్తోంది. పోటీ లేకుండా తెరాస అభ్యర్థికి లైన్ క్రియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు తాము ఓటింగుకు దూరంగా ఉంటున్నామని బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. టిడిపి తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్నికైన యనమల రామకృష్ణుడు, సలీం, శమంతకమణిలు నామినేషన్ వేసేందుకు బయలుదేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+