ఢిల్లీ గ్యాంగ్ రేప్: ఎవరీ రాంసింగ్, కథాకమామిషు?

Ram Singh
న్యూఢిల్లీ: ప్రధాన నిందితుడు రాంసింగ్ మృతితో ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసు సంచలమైన మలుపు తీసుకుంది. తీహార్ జైలులో అతను ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. అయితే, దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 33 ఏళ్ల రాంసింగ్‌ కుడి చేయికి చిన్నపాటి వైకల్యం ఉంది. ప్రమాదం కారణంగా ఆ చేయి అలా అయింది. తన దుస్తులతోనే తీహార్ జైలు సెల్‌లో అతను ఉరేసుకున్నాడని అధికారులు చెబుతున్నారు.

- ఢిల్లీ వైద్య విద్యార్థిని అత్యాచారానికి గురైన బస్సు డ్రైవర్‌గా అతను పనిచేస్తూ ఉండేవాడు. వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసిన సమయంలో అతని సోదరుడు బస్సు నడుపుతున్నట్లు చెబుతున్నారు.

- డిసెంబర్ 16వ తేదీ సంఘటనకు సంబంధించి రాంసింగ్‌పై 13 కేసులు నమోదయ్యాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అతనిపై రోజువారీగా విచారణ జరుగుతోంది. అతన్ని తీహార్ జైలు నెంబర్ 3లో ఉంచారు.

- కేసులోని ఇతర నిందితులు పవన్ (19), అక్షయ్ (29), జైలు నెంబర్ 4లో ఉంటున్నారు. వినయ్ (20), ముకేష్ (26) జైలు నెంబర్ 7లో ఉంటున్నారు.

- హింసాత్మక ప్రవర్తనకు అవకాశాలు ఉండడంతో రాంసింగ్‌లో ఆత్మహత్య చేసుకునే ధోరణలు ఉన్నాయని బావించి సూసైడ్ వాచ్ కింద పెట్టారు. మిగతా నిందితులపై కూడా సూసైడ్ వాచ్ ఉంది. వీరు ఇతర ఖైదీలతో కలవడం లేదు. వారి మధ్య కూడా సంభాషణలు లేవు.

- సోమవారం రాంసింగ్‌ను కోర్టుకు తరలించాల్సి ఉండింది.

- రాంసింగ్ ఇది వరకే నేరాన్ని అంగీకరించాడని పోలీసులు చెబుతున్నారు.

- రాంసింగ్‌ను హత్య చేశారని ఆరోపిస్తూ దానిపై సిబిఐ విచారణకు ఆదేశించాలని అతని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

రాంసింగ్ చెడు స్వభావం కలిగినవాడని, అతనికి తాగుడు అలవాటు కూడా ఉండేదని చెబుతారు. మిత్రులు అతన్ని మెంటల్ అని పిలిచేవారట. 2009లో అతను నడుపుతున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అతని కుడి చేయి దెబ్బ తిన్నది. రాడ్‌ పెట్టి వైద్యులు శస్త్రచికిత్స చేశారు.

తాగుడు, నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్‌ ఆరోపణలు అతనిపై ఉన్నాయి. మద్యం సేవించి ఇరుగుపొరుగువారితో గొడవ పడుతుండేవాడని చెబుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+