దిల్‌షుక్‌నగర్ పేలుళ్ల ప్రభావం తెలంగాణపై లేదు: షిండే

ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసు ప్రధాన నిందితుడు రాంసింగ్ ఆత్మహత్యపై సుశీల్ కుమార్ షిండే స్పందించారు. రాంసింగ్ ఆత్మహత్యపై విచారణ కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. రాంసింగ్ ఆత్మహత్యపై తీహార్ జైలు అధికారులు షిండేకు నివేదికను సమర్పించారు.
ఎన్‌సిటిసీ అంశంపై అన్ని రాష్ట్రాలకు లేఖలు రాస్తున్నట్లు ఆయన తెలిపారు. ఉగ్రవాదులు దాడులపై దర్యాప్తు చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిజానిజాలు దర్యాప్తులో వెల్లడవుతాయని ఆయన అన్నారు. దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తులో పురోగతి ఉందని చెప్పారు.
దిల్‌షుక్‌నగర్ పేలుళ్ల ఘటనలో సైకిల్ స్కెచ్‌లను పోలీసులు విడుదల చేశారు. విడిభాగాలను కొని నిందితులు సైకిళ్లను తయారు చేశారని సైబరాబాద్ పోలీసు కమీషనర్ చెప్పారు. సైకిళ్లు వెనకభాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, దీన్ని బట్టి బాంబులను క్యారియర్లపై పెట్టినట్లు అర్థమవుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications