ఢిల్లీ రేప్ విక్టింసూసైడ్: 15 నెలల్లో తీహార్ జైల్లో మూడోది

గతేడాది డిసెంబర్ 16న జరిగిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనలో 23 ఏళ్ల రామ్ సింగ్ జైలులోని తన సెల్ నెంబర్ 3లో తనకు తానుగా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన బట్టలతో అతను ఈ రోజు ఉదయం ఉరి వేసుకున్నాడు. దీంతో ఈ పదిహేను నెలల్లో ఈ జైలులో ఇది మూడో ఆత్మహత్య అయింది.
గతేడాది(2012)లో జైలులో 18 మంది చనిపోయారు. అందులో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లుగా జైలు అధికారులు చెప్పారు. తీహార్ జైలులో 2012వ సంవత్సరంలో పద్దెనిమిది మంది మరణించారని, అందులో పదహారు సహజ మరణాలు కాగా, రెండు ఆత్మహత్యలుగా జైలు అధికారి ఒకరు చెప్పారు. ఈ విషయాన్ని ఇటీవల అతను చెప్పారు.
ఇప్పుడు రామ్ సింగ్ ఆత్మహత్యతో మూడుకు చేరింది. ఈ ఏడాది రామ్ సింగ్ ఆత్మహత్య మొదటిది అని చెప్పారు. రామ్ సింగ్ ఆత్మహత్య పైన విచారణ జరిపిస్తున్నట్లు చెప్పారు. భారత దేశంలోని అత్యంత భద్రత కలిగిన తీహార్ జైలులో త్రీ లేయర్ సెక్యూరిటీ సిస్టం ఉంటుంది.












Click it and Unblock the Notifications