వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూర్తిగా చదవరా?: ఇంటర్వ్యూ రగడపై అంబటి కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ఎకనామిక్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూపై తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సోమవారం మండిపడ్డారు. తమ పార్టీ పైన బురద జల్లడమే వారి పనిగా కనిపిస్తోందన్నారు.

వార్తను పూర్తిగా చదువకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆ ఇంటర్వ్యూలో విజయమ్మ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పైన నిప్పులు చెరిగారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే మతతత్వ కూటమితో కలువబోమని చెప్పారని ఈ విషయాన్ని టిడిపి, తెరాసలు చిలువలు పలువలు చేసి ప్రచారం చేస్తున్నాయని నిప్పులు చెరిగారు. ప్రజల అండతో ముందుకు సాగుతున్న పార్టీ తమదన్నారు.

ఇతర పార్టీలతో కలవాల్సిన అవసరం తమకు ఏమాత్రం లేదన్నారు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్ల చందంగా ప్రచారం చేస్తున్నార్నారు. తప్పుడు హెడ్డింగును చూసి పార్టీపై బురద జల్లే ప్రయత్నాలు, ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రజల కోసం రెండేళ్లుగా తమ పార్టీ పోరాడుతుందని, అందుకే రాష్ట్రం తమ వైపు ఉందని, దీనిని జీర్ణించుకోలేక ఇతర పార్టీలు తమపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

బిజెపి గురించి అప్పట్లో జగన్ మాట్లాడిన సమయంలోను చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెసు ఎన్డీయేకు మద్దతిస్తుందనే ప్రచారం చేశారన్నారు. తాము కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా ఉంటే జగన్ జైలులో ఎందుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెసుతో చీకటి ఒప్పందాలు చంద్రబాబే పెట్టుకుంటున్నారని, అందుకే ఆయనపై కేసులు లేవన్నారు. ఈ ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.

అవిశ్వాసం పెట్టలేక అసెంబ్లీకే దూరంగా తిరిగే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారన్నారు. టిడిపి అవిశ్వాసం కాంగ్రెసుకు అనుకూలంగా ఉన్నదెవరో లేనిదెవరో తెలుస్తుందన్నారు. మూడో వ్యవస్థాపక దినోత్సవం నాటికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అంబటి రాంబాబు చెప్పారు.

English summary
YSR Congress Party spokes person Ambati Rambabu has clarified on party honorary president YS Vijyamma's interview.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X