హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాల్లోకి కెసిఆర్ రాయి: పొంగులేటి, జగన్ వర్గంపై వేటు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ponguleti Sudhakar Reddy
హైదరాబాద్: అవిశ్వాసం పేరుతో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గాలిలోకి రాయి విసిరారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి మంగళవారం విమర్శించారు. ముప్పై మంది ఎమ్మెల్యేలు కూడా లేని తెలంగాణ రాష్ట్ర సమితి అవిశ్వాసం పెడతామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన తన పార్టీ రేటింగ్ కోసమే ఆ ప్రకటన చేశారన్నారు.

బెదిరేది లేదు

ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం హెచ్చరికలకు బెదిరే ప్రసక్తి లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఫిరాయింపుదారులపై చర్యలు తప్పవని ఆయన అన్నారు. తమకు అసెంబ్లీలో స్పష్టమైన సంఖ్యాబలం ఉందన్నారు. అవిశ్వాసం ఎవరు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఫిరాయింపుదారులపై చర్యలు తప్పదని చెప్పడం ద్వారా విపక్షాల అవిశ్వాస తీర్మానానికి ముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్లిన పలువురు కాంగ్రెసు ప్రజా ప్రతినిధులపై వేటు పడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. వారిపై వేటు వేసి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేసే అవకాశాలు ఉన్నాయనే చెప్పవచ్చు.

చట్టసభల్లో ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతిపక్షాలకు ధ్యాస లేదని మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ గుంటూరు జిల్లాలో విమర్శించారు. ఆరు నెలల క్రితమే ప్రభుత్వం అసెంబ్లీలో విశ్వాసాన్ని నిరూపించుకుందని చెప్పారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకే తరుచూ అవిశ్వాస తీర్మానంపై ఆలోచనలు చేస్తున్నారన్నారు.

English summary
Congress Party senior leader and MLC Ponguleti Sudhakar Reddy has blamed Telangana Rastra Samithi chief K Chandrasekhar Rao for his statement on No Confidence Motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X