హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మజ్లిస్ నిర్ణయం: బాబుకి ఊరట, జగన్‌కు మొండిచేయి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Asaduddin Owaisi-Chandrababu Naidu
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ నిర్ణయం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు స్వల్ప ఊరట ఇచ్చిందనే చెప్పవచ్చు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పైన తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం ఓటింగుకు 45 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. టిడిపి, మజ్లిస్ మినహా అన్ని పార్టీలు అవిశ్వాసానికి మద్దతుగా నిలిచాయి.

అవిశ్వాసంపై చర్చకు రావడంతో తెలుగుదేశం పార్టీ పూర్తిగా చిక్కుల్లో పడిందనే చెప్పవచ్చు. అవిశ్వాసంపై చర్చ తర్వాత జరిగే ఓటింగులో టిడిపి తప్ప మిగిలిన అన్ని పార్టీలు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసే అవకాశాలు ఉంటాయని భావించారు. అదే జరిగితే టిడిపి పూర్తిగా ఇబ్బందుల్లో చిక్కుకునేదే అంటున్నారు. తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ఆరోపించినట్లుగా కాంగ్రెసు, టిడిపి మధ్య లోపాయికారి ఒప్పందం ఉందనే వాదనకు మరింత బలం చేకూరేది.

అయితే, మజ్లిస్ పార్టీ నిర్ణయం బాబుకు ఊరట నిచ్చిందని అంటున్నారు. టిడిపి తప్ప మిగిలిన పార్టీలు అవిశ్వాస తీర్మానంపై చర్చ తర్వాత జరిగిన ఓటింగులో పాల్గొంటే కిరణ్ ప్రభుత్వం పడక పోయినా టిడిపి దారుణంగా దెబ్బ తినేదంటున్నారు. అయితే, అసద్ కూడా అవిశ్వాసానికి దూరంగా ఉండటంతో ఆ నిర్ణయం బాబుకు కొంతలో కొంత ఊరట అని అంటున్నారు. అవిశ్వాసానికి దూరంగా తాము ఎందుకుంటున్నామో మజ్లిస్ పార్టీ చెప్పింది.

టిడిపికి కూడా చెప్పుకునే అవకాశం వచ్చిందంటున్నారు. ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేదని, అయినా అవిశ్వాసంతో లబ్ధి పొందాలని బిజెపి చూస్తోంది కాబట్టి తాము దూరంగా ఉంటున్నట్లు చెప్పింది. అదే విధంగా తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తమ తమ రాజకీయ లబ్ధి కోసం అవిశ్వాసం పెట్టాయని, కాబట్టి తాము కూడా దూరంగా ఉంటున్నామని చెప్పుకునేందుకు టిడిపికి మరింత అవకాశం లభించిందంటున్నారు. మరోవైపు కాంగ్రెసుకు దూరమైన మజ్లిస్ అవిశ్వాసానికి మద్దతివ్వక పోవడం ద్వారా జగన్‌కు ఓ విధంగా షాక్ ఇచ్చినట్లేననే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
It is said that MIM's decision on No Confidence Motion is small relief to Telugudesam Party chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X