వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జోగి కోసం జగన్ పార్టీ: శంకరన్నకు దానం ఫోన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Komatireddy - Shankar Rao
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు జోగి రమేష్‌ను వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దువ్వుతున్నట్లు సమాచారం. జోగి రమేష్‌తో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తమ వైపు రావాలని, అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేయాలని వారు జోగి రమేష్‌ను కోరుతున్నట్లు సమాచారం. జోగి రమేష్‌ను మంత్రి పార్థసారథి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్దకు తీసుకుని వెళ్లారు. తాను కాంగ్రెసు వైపే ఉంటానని జోగి రమేష్ చెప్పారు.

కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై గుర్రుగా ఉన్న మాజీ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, పి. శంకరరావును అధికార కాంగ్రెసు పార్టీ దువ్వే ప్రయత్నం చేస్తోంది. వారిద్దరికి మంత్రి దానం నాగేందర్ ఫోన్ చేసినట్లు సమాచారం. గ్రీన్‌ఫీల్డ్ కేసులో చిక్కుకున్న శంకరరావు ముఖ్యమంత్రిపై ఆగ్రహంతో ఉన్నారు. ఆయన ఆరోగ్యం కూడా సరిగా లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ముఖ్యమంత్రి మీద తెలంగాణ అంశంపై ఆగ్రహంగానే ఉన్నారు. తాను ఢిల్లీలో ఉన్నానని, ఓటింగులో పాల్గొనలేనని కాంగ్రెసు శాసనసభ్యుడు మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు.

ఇదిలావుంటే, కాంగ్రెసు శాసనసభ్యురాలు కొర్ల భారతి అమెరికాలో ఉన్నట్లు సమాచారం. ఆమె అవిశ్వాస తీర్మానంపై ఓటింగులో పాల్గొనే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానంపై తటస్థంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవిశ్వాస తీర్మానం ముప్పు నుంచి బయటపడినట్లే. ఏడుగురు సభ్యులు గల మజ్లీస్ కూడా అవిశ్వాస తీర్మానాన్ని సమర్థించబోమని ప్రకటించింది.

అయితే, సాధ్యమైనంత ఎక్కువ బలంతో అవిశ్వాస తీర్మానాన్ని ఓడించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే దూరంగా ఉన్నవారిని సభకు రప్పించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తమ పార్టీ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులుకు ఫోన్ చేసి మాట్లాడారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మోత్కుపల్లి చేసిన ప్రసంగాన్ని ఆయన మెచ్చుకున్నారు.

English summary
According to sources - YS Jagan's YSR Congress party is wooing Congress MLA Jogi Ramesh and minister Danam Nagender has telepohoned to former ministers Komatireddy Venkat Reddy and P Shankar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X