జగన్ క్యాంప్ ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై వేటు?

ఆళ్ల నాని, సుజయ కృష్ణ రంగారావు, మద్దాల రాజేష్ తదితర ఎనిమిది మంది కాంగ్రెసు ఎమ్మెల్యేలు జగన్ వైపుకు వెళ్లారు. వారు అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రభుత్వానికి ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. దీనిపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం మాట్లాడారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే ఎమ్మెల్యేలపై ధిక్కార చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరికీ తాము విప్ జారీ చేశామన్నారు. అందరు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలన్నారు. ప్రభుత్వానికి మద్దతు ప్రకటించని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాము ఉప ఎన్నికలకు భయపడే ప్రసక్తి లేదన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.
రేపు ఫిర్యాదు
జగన్ వర్గానికి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై రేపు స్పీకర్‌కు కాంగ్రెసు పార్టీ ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారిపై వేటుకే కాంగ్రెసు సిద్ధపడ్డట్లుగా కనిపిస్తోంది. తద్వారా వచ్చే ఉప ఎన్నికలకు సైతం ఆ పార్టీ సమాయత్తమవుతోంది. కాగా అసెంబ్లీ ఐదు నిమిషాలు వాయిదా పడింది.












Click it and Unblock the Notifications