ఇవాళే చర్చ, ఓటింగ్: జగన్, తెరాసలపై కాంగ్రెస్ ఎత్తుగడ

బిఏసి సమావేశంలో విపక్ష నేతలతో స్పీకర్ చర్చించారు. అనంతరం ఈ రోజు ఉదయం పదకొండున్నర గంటల నుంచి అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని స్పీకర్ నిర్ణయించారు. మొత్తం ఎనిమిది గంటల పాటు చర్చ చేపట్టనున్నట్లు చెప్పారు. వెంటనే అవిశ్వాసపై చర్చను టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు, తెరాస సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానం పెండింగులో ఉండగా బడ్జెట్ ప్రవేశ పెట్టడం సరికాదని స్పీకర్ వారికి నచ్చజెప్పారు.
ఈ చర్చలో కాంగ్రెసు పార్టీ 1.50 నిమిషాలు, తెలుగుదేశం పార్టీ 1.35 నిమిషాలు, తెలంగాణ రాష్ట్ర సమితి గంట, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 45 నిమిషాలు, బిజెపి, సిపిఐలకు ఇరవై నిమిషాలు, మజ్లిస్‌కు అర్ధగంట, లోక్‌సత్తా, సిపిఎం, నాగం, ఇతర సభ్యులకు పదిహేను నిమిషాల చొప్పున సమయం కేటాయించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి చర్చలో వైయస్ విజయమ్మ, భూమన కరుణాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఈటెల రాజేందర్, హరీష్ రావులు చర్చలో పాల్గొంటారు.
సభకు ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు గైర్హాజరు
కాగా, సభకు టిడిపి రెబల్ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అనారోగ్య కారణాల వల్ల హాజరు కావడం లేదు. ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, అంబటి బ్రాహ్మణయ్యలు కూడా అనారోగ్య కారణాల వల్ల హాజరు కావడం లేదు.
జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు గండ్ర విప్
అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపుకు వెళ్లిన కాంగ్రెసు పార్టీ ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి విప్ అందించారు. ఎమ్మెల్యేల సంతకాలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications