వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుపై విజయమ్మ విసుర్లు, టిడిపి ఆక్షేపణ:గందరగోళం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu - YS Vijayamma
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి తీసుకు వచ్చిన కాంగ్రెసు పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం బాధాకరమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ శుక్రవారం అన్నారు. అవిశ్వాసం తీర్మానం నేపథ్యంలో ఆమె సభలో మాట్లాడారు.

బాబుపై విసుర్లు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర పైన ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెసు ప్రభుత్వంతో టిడిపి కుమ్మక్కయిందని ఆరోపించారు. పాదయాత్ర చేస్తూ అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్న బాబు అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశ పెట్టడం లేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ కూడా అవిశ్వాసం పెట్టక పోవడం వల్ల తాము అవిశ్వాసం పెట్టామన్నారు.

బయట విమర్సలు చేస్తున్న బాబు సభ లోపల మాత్రం ప్రభుత్వాన్ని కాపాడటంలోని అంతరార్థం ఏమిటో తెలియడం లేదన్నారు. వైయస్ తెచ్చిన సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం హయాంలో అమలు కావడం లేదని విమర్శించారు. టిడిపి విప్ జారీ చేయడం చరిత్రలో ఇదే ప్రథమం అన్నారు. చంద్రబాబు అంతర్మాత ఎవరికీ అంతుపట్టడం లేదన్నారు. ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానానికి ఓటు వేయక పోవడం ప్రపంచ చరిత్రలోనే లేదన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కయ్యాయనేందుకు ఇదే నిదర్శనం అన్నారు.

గందరగోళం

కాంగ్రెసు, టిడిపి కుమ్మక్కయిందన్న విజయమ్మ విమర్శలతో సభలో గందరగోళం చెలరేగింది. విజయమ్మ వ్యాఖ్యలపై టిడిపి ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే కాంగ్రెసుతో కుమ్మక్కయిందని దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి ఓటు ఎలా వేశారని ప్రశ్నించారు.

English summary
Telangana Rastra Samithi LP Etela Rajender has introduced No Confidence Motion in Assembly on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X