వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ పని చేయలేను:జగన్‌పై బాబు, చికెన్‌పై సరదా వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
ఏలూరు: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తాను జైలు నుండి బయటకు రావడానికే అవిశ్వాసం నాటకం ఆడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో తన వస్తున్నా మీకోసం పాదయాత్ర సందర్భంగా అన్నారు. గతంలో ఒకసారి అవిశ్వాసం పెడితే ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారని, సూట్‌కేసుల కోసం, ఖరీదైన కార్ల కోసం ఆశపడి పోయారని, మరోసారి ఆ తప్పు తాను చేయలేనన్నారు.

తాము అవిశ్వాసం పెడితే వారు అమ్ముడుపోతారన్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే కచ్చితంగా ఎమ్మెల్యేలను కొనాలని, ప్రజాస్వామ్యాన్నీ కొనేయాలని, ఆ పనిని తాను చేయలేనని చెప్పారు. కరెంటు ఇవ్వాల్సిన వేళ సర్కారు చార్జీల షాకులు ఇస్తోందని మండిపడ్డారు. ఇది సర్కారు కాదు.. దోపిడీదారు అని ధ్వజమెత్తారు. విద్యుత్ సర్‌చార్జీలు మరోసారి పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనను మార్టేరు, పెనుగొండ సభల్లో ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

తెరాస అవిశ్వాసం నిర్ణయాన్ని ఆయన తోసిపుచ్చారు. ఎమ్మెల్యేలను పశువుల మాదిరిగా కొంటున్నారని, అలాంటివాళ్లు అవిశ్వాస తీర్మానం పెడితే టిడిపి సమర్థించాలా? అని ప్రశ్నించారు. చీకటి రాజకీయాలు, సూట్‌కేసు రాజకీయాలకు టిడిపి దూరమని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజునే అవిశ్వాసం అంటూ ఆ రెండు పార్టీలు చీకటి రాజకీయాలతో ముందుకొచ్చాయని ఆరోపించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చకు ఒకసారి తాము సిద్ధం కాగా, ఆకలి అవుతున్నదంటూ వైయస్ వెళ్లిపోయేవారని గుర్తు చేశారు.

చికెన్ పైన సరదా వ్యాఖ్య

మార్టేరులో బాబు ప్రసంగం పూర్తయిన తర్వాత టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు మార్టేరు చికెన్ పకోడి చాలా బాగుంటుందని, తినమని బాబు వద్దకు తీసుకు వచ్చాడు. ఈ సందర్భంగాలో బాబు సరదాగా మాట్లాడుతూ... తాను ప్రతిరోజు రాగులు, సజ్జలు, జొన్నలతో తయారు చేసిన జావ, కూరగాయలు తింటానని, మాంసాగారం తినడం మానేసి చాలా కాలం అయిందని, తనతో చికెన్ తినిపించాలని మాగంటి బాబు చూస్తున్నారని, తాను తినలేనని, ఆయన భోజన ప్రియుడు, అందరికీ భోజనం పెట్టిస్తాడు, తింటాడని, మార్టేరు చికెన్ పకోటి... మాగంటి పేరు చెప్పి అందరూ తిని, బిల్లు మాత్రం ఆయనకు అప్పగించాలని సరదాగా వ్యాఖ్యానించారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu has blamed YSR Congress Party and Telangana Rastra Samithi for no confidence motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X