వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిట్టి మొహంతి అకడమిక్ పత్రాలన్నీ నకిలీవే

By Pratap
|
Google Oneindia TeluguNews

Bitti Mohanty
భువనేశ్వర్: జర్మన్ యువతిపై అత్యాచారం కేసులో దోషి బిట్టి మొహంతి అలియాస్ రాఘవ రాజన్ అకడమిక్ పత్రాలన్నీ నకిలీవేనని కేరళ పోలీసులు నిర్ధారించుకున్నట్లు వార్తలు వచ్చాయి. రాఘవ రాజన్ పేరు మీద ఉన్న అకడమిక్ రికార్డులన్నీ ఫోర్జరీ చేసినవేనని కేరళ పోలీసులు ధ్రువీకరించుకున్నట్లు సమాచారం. బిట్టి మొహంతి 2004లో బిటెక్ చేసిన భువనేశ్వర్‌లోని కళింగ పారిశ్రామిక సాంకేతిక సంస్థను కేరళ పోలీసులు సందర్శించారు. వైస్ చాన్సలర్‌ను ఆయన కలుసుకున్నారు.

బిటెక్ చదవడానికి ముందు బిట్టీ చదివిన కటక్ స్టీవార్ట్ స్కూల్‌ను, క్రిస్ట్ కాలేజీని కూడా కేరళ పోలీసులు సందర్శించారు. రాఘవ రాజన్ పేరు మీద పొందిన పత్రాలన్నీ ఫోర్జరీ చేసినవనే విషయాన్ని తాము తేల్చుకున్నట్లు కేరళ పోలీసు బృందానికి నేతృత్వం వహిస్తున్న జోస్ జోసెఫ్ చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

బిట్టి మొహంతిని గుర్తించడానికి అతన్ని మార్చి 12వ తేదీన జైపూర్‌కు తీసుకుని వెళ్లారు. ఏడేళ్ల పాటు పరారీలో ఉన్న బిట్టి మొహంతీని కేరళ పోలీసులు వారం రోజుల క్రితం అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని ఆల్వార్ జైలులో ఉన్నప్పుడు పెరోల్‌పై బయటకు వచ్చి కనిపించకుండా పోయాడు.

కేరళ రాష్ట్రంలోని కన్నూరులోని బ్యాంకులో అతను ఏడు నెలలుగా పనిచేస్తున్నాడు. కన్నూరు విశ్వవిద్యాలయంలో ఎంబిఎ చేసినట్లుగా బిట్టీ చెప్పుకున్నాడు. బిట్టి ఒడిషా మాజీ డిజిపి బిబి మొహంతి కుమారుడు. బిట్టి పెరోల్‌ను జంప్ చేయడానికి తండ్రి సహకరించాడనే ఆరోపణలున్నాయి. జర్మన్ యువతిపై అత్యాచారం చేసిన కేసులో బిట్టికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది.

English summary
The truth about Bitti Mohanty aka Raghav Rajan is out with the Kerala police confirming that the rape convict had forged his academic documents. According to sources, all his educational certificates under the name of Raghav Rajan have been forged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X