తెలంగాణ ఇస్తారా? లేదా?: ఢిల్లీకి కెసిఆర్, రాములమ్మ

తెలంగాణ అంశంపై తాను, విజయశాంతి కలిసి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను స్తంభింపజేస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. కెసిఆర్ వెంట పార్టీ సీనియర్ నేతలు వినోద్ కుమార్, విజయ రామారావు, జగదీశ్ రెడ్డిలు ఢిల్లీకి వెళ్లనున్నారు. అసలు యూపిఏ సర్కారు తెలంగాణ ఇస్తుందా? లేదా? అనే విషయాన్ని ఈ పర్యటనలో కెసిఆర్ తేల్చుకుంటారని పార్టీ నేతలుచెబుతున్నారు.
సాధారణ ఎన్నికల గడువు సమీపిస్తుండటం, రాష్ట్రంలో స్థానిక ఎన్నికల శంఖారావం ఎప్పుడైనా మోగే పరిస్థితుల్లో యూపిఏకు సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్‌తో తెలంగాణపై స్పష్టత తీసుకోవాలని కెసిఆర్ భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు మొదటి నుంచి తెలంగాణ విషయంలో సానుకూలంగా ఉంటూ ఆ అంశాన్ని త్వరగా తేల్చాలని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని యూపిఏ సమన్వయ కమిటీ సమావేశాల్లో కోరిన ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌ను కలవాలని నిర్ణయించారు.
ఆయన ద్వారా తెలంగాణపై యూపిఏ మనోగతాన్ని తెలుసుకోవాలని తెరాస అధినేత భావిస్తున్నారు. ఏప్రిల్‌లోనైనా కేంద్రం తెలంగాణపై సానుకూల ప్రకటన చేస్తుందనే ఆశతో కెసిఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో తెరాసను విలీనం చేస్తామని మరోమారు చెప్పారట. ఈసారి ఢిల్లీ పర్యటనలో దానిపై కూడా తమకు స్పష్టత వస్తుందని, తదనుగుణంగా భవిష్యత్తు వ్యూహం ఖరారు చేసుకుంటారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications