వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదును చూసి పంచ్: అవిశ్వాసంపై టిడిపి వ్యూహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల అవిశ్వాసంపై తటస్థ వైఖరి అవలంబించిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సమయం చూసుకొని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై పంచ్ విసరాలని భావిస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రతో ప్రజల్లో ఉన్నారు. తమకు అనుకూలంగా ఉంటుందని భావించినప్పుడు అవిశ్వాసాస్త్రాన్ని వదలాలని ఆ పార్టీ భావిస్తోంది.

సొంతంగా అవిశ్వాస్త్రం పెట్టాలని టిడిపి భావిస్తోంది. సీమాంధ్ర, తెలంగాణల్లో తమ గ్రాఫ్ పెరగడం ప్రారంభమైందని, గత మూడు నెలల్లోనే ప్రజల్లో టిడిపికి ఆదరణ ఆరు శాతం వరకు పెరిగినట్లు తమ సర్వేల్లో వెల్లడైందని వచ్చే ఆరేడు నెలల్లో మరింత పెరిగే అవకాశముందని ఆ పార్టీ భావిస్తోంది. ఆరేడు నెలలు గడిస్తే సొంతంగా గెలవగలిగిన వాతావరణం నెలకొంటుందని అప్పుడు అవిశ్వాసానికి సై అంటామని చెబుతున్నారట.

ఆ సమయం వచ్చిందనుకొన్నప్పుడు అధికార పార్టీ పైన సొంతంగానే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి సర్కారును దించాలన్నది తమ పార్టీ అంతర్గత వ్యూహంగా చెబుతున్నారు. అదే సమయంలో గీత దాటిన వారిపై ఇప్పటికిప్పుడు వేటు వేసి, ఉప ఎన్నికలు ఎదుర్కోవాలని కూడా ఆ పార్టీ భావించడం లేదట. ఉప ఎన్నికలపై ఆసక్తి లేని ఆ పార్టీ, తెస్తే అసెంబ్లీ ఎన్నికలే తేవాలనే ఉద్దేశ్యంతో ఉందట.

విప్ ధిక్కరించిన వారిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. అయితే, చర్యలకు అంతగా వెంట పడకపోవచ్చునని చెబుతున్నారు. కిరణ్ ప్రభుత్వం ఇప్పుడు అవిశ్వాసం ఎదుర్కోవడంతో మరో ఆరు నెలల వరకు ఆ ఊసెత్తే పరిస్థితి లేదు. అప్పటి వరకు పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకు వెళ్లి, సాధారణ ఎన్నికలకు మరో ఆరు నెలలు ఉండగానే కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి ప్రజల్లో క్రెడిట్ కొట్టేయాలని టిడిపి భావిస్తోందంటున్నారు.

English summary
Telugudesam party may move No Confidence Motion after Six month on Kiran Kumar Reddy government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X