మజ్లిస్‌పై ముస్లిం అభ్యర్థిని నిలపరు: వెంకయ్య విమర్శ

రాష్ట్ర ప్రభుత్వ అన్నింటా విఫలమైందని, ఏ రాష్ట్రంలో ఇంతటి విద్యుత్తు సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదని, ప్రభుత్వ అసమర్థత, చేతగానితనం, బాధ్యతారాహిత్యం వల్ల ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని, ఇక తెలుగుదేశం, మిగతా పార్టీలన్నింటిదీ అదే ముసుగని, ఈ ప్రభుత్వానికి తలాక్ ఇచ్చేస్తే ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలన్న ధ్యాసతో రాజకీయాలు నడుపుతున్నాయని, ఓటు బ్యాంకు విధానాలే పరమావధిగా పని చేస్తున్నాయని విమర్శించారు.
హైదరాబాద్ లోక్‌సభ సీటులో మజ్లిస్‌పై ఏ పార్టీ కూడా ముస్లిం అభ్యర్థిని నిలపలేదని, కాంగ్రెస్ పార్టీ సుధాకర్ రెడ్డిని, టిడిపి తీగల కృష్ణా రెడ్డిని పోటీలో దింపాయని, ముస్లింల ఓట్లు చీలకుండా, మజ్లిస్ గెలవాలన్న ఉద్దేశంతోనే పార్టీలు ఇలాంటి గిమ్మిక్కులు చేశాయని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కుహన లౌకికవాద పార్టీలుగా చెలామణి అవుతున్నాయన్నారు. ఇక వామపక్షాలు ఇవాళ కాంగ్రెస్‌తో, రేపు టిడిపితో అన్నట్లు అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుంటాయని విమర్శించారు.
అన్ని పార్టీలకు న్యాయం చేయాలన్నదే వారి తపనలా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఏం జరుగుతుందో చూడండని, కొంతమందిని అరెస్టు చేస్తారని, దీంతో ఒక్కో పార్టీ గళం విప్పుతుందని, అమాయకులను అరెస్టు చేశారంటూ పోలీసులపై దుమ్మెత్తి పోస్తాయని, పాపం పోలీసులు నిర్వీర్యమవుతారని, ఉగ్రవాది ఉగ్రవాదే, వారిని సపోర్ట్ చేసేవారూ ఉగ్రవాదులేనన్నారు.
ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని, కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. బిజెపి అధికారంలోకి వస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నారన్నారు. ప్రజల్లో అభిమానం ఉన్నప్పుడే పార్టీని బలోపేతం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ప్రతి ఇంటిలోనూ బిజెపికి ఓటేయ్యాలంటున్న వారు పెరిగారని, అందుకే ప్రతి నాయకుడు, కార్యకర్తా పల్లెపల్లెకు వెళ్లాలని సూచించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!