వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏప్రిల్ 19న బాబు యాత్ర ముగింపు: ముందస్తు కోసమే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్/విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర ఏప్రిల్ 19వ తేదిన ముగియనుంది. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2వ తేదిన చంద్రబాబు పాదయాత్ర ప్రారంభమైంది. ఆయన పాదయాత్ర 150 రోజులు పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 19 నాటికి పాదయాత్ర 200 రోజులకు చేరుకుంటుంది.

ఆ మరుసటి రోజు(ఏప్రిల్ 20) చంద్రబాబు పుట్టిన రోజు. దీంతో ఏప్రిల్ 19వ తేదిన చంద్రబాబు తన పాదయాత్రను ముగించనున్నారు. ఏప్రిల్ 20వ తేదిన విశాఖపట్నంలో తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకొని హైదరాబాదుకు బయలుదేరుతారు. మిగిలిన ఆరు జిల్లాల్లో ఆయన బస్సు యాత్ర చేయనున్నారు.

ముందస్తు వ్యూహం

కేంద్రంలో యూపిఏ, రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు అత్తెసరు మెజార్టీతో ప్రభుత్వాన్ని లాక్కొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలు రావొచ్చునని తెలుగుదేశం పార్టీ అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండే ఉద్దేశ్యంలో భాగంగా కూడా చంద్రబాబు తన పాదయాత్రను ముగించనున్నట్లుగా చెబుతున్నారు.

అవిశ్వాస తీర్మానంపై సమాలోచనలు

త్వరలో రెండో విడత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే విషయంపై సమాలోచనలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. ఈ నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై పార్టీలో చర్చ సాగుతోందని సమాచారం. ఓసారి అవిశ్వాస తీర్మానం పెట్టాక ఆరు నెలల వరకు ఆ అవకాశం లేదు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu's Vastunna Meekosam Padayatra will end on 19th of April.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X