వస్తున్నారా? రానంటే రాను: డికె అరుణ వర్సెస్ జానా

K Jana Reddy-DK Aruna
హైదరాబాద్: పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి, సమాచార శాఖ మంత్రి డికె అరుణ మధ్య విబేధాలు బుధవారం బయటపడ్డాయి! ఈ నెల 24వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ కార్యక్రమానికి డికె అరుణకు ఇప్పటి వరకు సమాచారం లేదట. దీనిపై ఈ రోజు జానా రెడ్డి ఆమెను అడిగడంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారట. ఈ నెల 24న మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలో ఓ ప్రాజెక్టు శంకుస్థాపన జరగనుంది.

ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, రాష్ట్ర మంత్రి జానా రెడ్డిలు వస్తున్నారు. అయితే, ఈ విషయంపై డికె అరుణకు ఇప్పటి వరకు సమాచారం లేదట. ఈ రోజు లాబీల్లో కనిపించిన డికె అరుణతో జానా రెడ్డి.. శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్నారా అని ప్రశ్నించారట. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన డికె అరుణ తాను రానని ఖరాఖండింగా చెప్పేసినట్లుగా సమాచారం.

జిల్లాకు చెందిన మంత్రిని అయిన తనకు ఇప్పటి వరకు ఈ కార్యక్రమం గురించి తెలియక పోవడమేమిటని ఆమె జానాను ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. కార్యక్రమానికి నాలుగు రోజుల ముందు చెప్పడమేమిటని ఆమె ప్రశ్నించారట. దీంతో, మీకు వీలుగా ఉన్న మరో తేదీ చూపిస్తే అదే రోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని పెట్టుకుందామని జానా రెడ్డి సూచించారట.

అందుకు డికె అరుణ ససేమీరా అన్నట్లుగా తెలుస్తోంది. తనకు ఇప్పటి వరకు చెప్పలేదని, అలాంటప్పుడు తాను కార్యక్రమానికి వచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారట. డికె అరుణకు చెప్పక పోవడంపై జిల్లాకు చెందిన ఆమె వర్గం నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+