హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ తడబడిన జగన్ పార్టీ: పెద్దిరెడ్డికి గ్రాండ్ వెల్‌కం

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan-YSR Congress
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మరోసారి తడబడింది! బుధవారం అసెంబ్లీ సమావేశాలు గురువారానికి వాయిదా పడిన అనంతరం ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి తదితరులు మీడియా పాయింటు వద్ద మాట్లాడారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల పైన మండిపడ్డారు. ఆ పార్టీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు.

కాంగ్రెసు పార్టీ చిహ్నమైన టోపీలు ధరించి తెలుగుదేశం పార్టీ నేతలు వచ్చారని, ఇది చంద్రబాబు నాయుడు అధికార పార్టీతో కుమ్మక్కవుతున్నారనేందుకు నిదర్శనమన్నారు. దీనిపై స్పందించిన మీడియా.. అవి మహాత్మా గాంధీ టోపీలు అని అవి ధరిస్తే కాంగ్రెసు టోపీలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. ప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త అన్నా హజారే కూడా అదే టోపీని ధరిస్తున్నారని మీడియా చెప్పింది.

మీడియా ప్రశ్నలకు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓటు వేసిందని, అలాంటప్పుడు టిడిపి కుమ్మక్కైందని ఎలా చెబుతారని మీడియా ప్రశ్నించింది. దానికి నేరుగా సమాధానం ఇవ్వకుండా తాము ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాత్రమే ఓటు వేశామని చెప్పి అక్కడ నుండి తప్పుకున్నారు.

పెద్దిరెడ్డికి తిరుపతిలో ఘన స్వాగతం

అవిశ్వాస తీర్మానం సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్దతిచ్చిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి చిత్తూరు జిల్లా తిరుపతిలో ఘన స్వాగతం లభించింది. అవిశ్వాస తీర్మానం తర్వాత ఆయన మొదటిసారి జిల్లాకు వెళ్లారు. జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆయనకు ఘనంగా స్వాగతం పలికింది. పెద్దిరెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు.

English summary
It is said that YSR Congress Party leaders were confused over giving answer to Media persons questions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X