చర్చ సెక్స్‌పై కాదు: బాంబు పేలుళ్లపై పరిపూర్ణానంద

పార్లమెంట్‌లో ప్రస్తుతం శృంగార అర్హత, వయసుల గూర్చి చర్చిస్తున్నారని దేశ భద్రత, సంస్కృతి, జాతి గౌరవం గురించి మాట్లాడకపోవడం హాస్యాస్పదమన్నారు. హిందువులంతా ఒకే గొడుగు కిందికి వచ్చి భారత దేశ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. అన్యమతస్థులు, మత చాందసులు హిందూ దేవతలను, సంస్కృతిని, ధర్మాన్ని కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైందవ గురువులంతా ఐక్యంగా నిలిచి హిందూ ధర్మాన్ని ఒకే గొడుకు కిందకు తీసుకు రావాలన్నారు.
లౌకికవాదం పేరుతో హిందూ ధర్మాన్ని అణగదొక్కితే సహించేది లేదన్నారు. చిన్న జీయర్ స్వామితో కలిసి ఉగాది నాడు శ్రీరామ భక్త తరంగిణి పేరుతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడుతామని ఎనిమిది కోట్ల మంది హిందువులను ఒక్క తాటి పైకి తెస్తామని పరిపూర్ణానంద అన్నారు. సైకిల్ బాంబులతో జాతిని నిర్వేదం చేయడం సరికాదని దైవంతోనే జాతిని నిర్మించగలమన్నారు. మతాన్ని మతంగా నిలపాలని, దానిని రాజకీయ వ్యవస్థగా మార్చవద్దన్నారు.
ఒంటి నిండా తుపాకీ గుళ్లతో ఉన్నప్పుడు వారిని కాపాడింది హిందూ ఆసుపత్రియేనని, హిందూ వైద్యులేనని, ప్రాణం తీయాలని చూసింది మాత్రం ఆయన వర్గీయులే అన్నారు. బాంబుల పేరుతో సమాజాన్ని అతలాకుతలం చేస్తున్నారని విమర్శఇంచారు. దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్లలో అన్ని మతాల వారున్నారని, ఇక్కడ గుర్తించాల్సింది మతాన్ని కాదని, చనిపోయింది మనిషి అనే విషయాన్ని విస్మరించవద్దన్నారు.












Click it and Unblock the Notifications