వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మొదట ముగ్గురే రాజీనామా: దిగొచ్చిన అళగిరి తర్వాత..

By Pratap
|
Google Oneindia TeluguNews

Alagiri
న్యూఢిల్లీ: యుపిఎకు మద్దతు ఉపసంహరించుకోవాలనే నిర్ణయం డిఎంకె అధినేత కరుణానిధికి కొత్త కష్టాలు తెచ్చి పెట్టింది. ఐదుగురు కేంద్ర మంత్రుల్లో ముగ్గురు మాత్రమే తొలుత రాజీనామా చేశారు. ఐదుగురు మంత్రుల్లో ముగ్గురు మంత్రులు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కలిసి రాజీనామా పత్రాలు సమర్పించారు. మొదట అళగిరి, నెపోలియన్ రాజీనామాలు చేయలేదు. కరుణానిధి తనను సంప్రదించలేదని అళగిరి అంటున్నారు. అయితే, చివరకి అళగిరి, నెపోలియన్ కూడా దిగొచ్చి రాజీనామాలు చేశారు.

అళగిరిని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. స్టాలిన్‌ను తన వారసుడిగా తండ్రి కరుణానిధి ప్రకటించడంపై రగిలిపోతున్న అళగిరి తిరుగుబాటుకు సిద్ధమైనట్లు భావించారు. మరో ఇద్దరు రాజనామా చేయకపోవడానికి కారణమేమిటనే విషయంపై టిఆర్ బాలు ప్రతిస్పందిస్తూ తమలో విభేదాలు లేవని, మిగతా ఇద్దరు తర్వాత రాజీనామాలు సమర్పిస్తారని చెప్పారు. తమ రాజీనామాలను ప్రధాని అంగీకరించినట్లు ఆయన తెలిపారు.

రెండు డిమాండ్లను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ యుపిఎ నుంచి వైదొలిగే విషయంలో వెనక్కి తగ్గేది లేదని కరుణానిధి చెబుతున్నారు. ఈ వారాంతంలో జెనీవాలో ఐక్యరాజ్య సమితి (యుఎన్) శ్రీలంకలోని తమిళుల విషయంలో పెట్టే తీర్మానంపై సవరణలు ప్రతిపాదించడానికి కాంగ్రెసు ముందుకు వచ్చినా కరుణానిధి తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడడం లేదు. అటువంటి తీర్మానాన్నే పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది.

కరుణానిధికి ఫోన్ చేయడంతో 2003లో కాంగ్రెసుతో డిఎంకె పొత్తుకు సిద్ధపడింది. ప్రస్తుతం డిఎంకెకు 18 మంది పార్లమెంటు సభ్యులున్నారు. లోకసభ ఎన్నికల తర్వాత రెండేళ్లకు 2011లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో డిఎంకె ఘోరంగా ఓటమి పాలైంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరుణానిధి కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

English summary
Three of the five DMK ministers in the union government met the Prime Minister today and resigned. Their party exited his fragile coalition last night, citing India's refusal to take a strong stand against Sri Lanka at the UN's top human rights body in Geneva.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X