వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రివేంజ్?: స్టాలిన్ ఇంట్లో సిబిఐ సోదాలు, వెనుకడుగు

By Srinivas
|
Google Oneindia TeluguNews

MK Stalin
చెన్నై/న్యూఢిల్లీ: డిఎంకె నేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు స్టాలిన్ నివాసంలో గురువారం తెల్లవారుజాము నుండి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) సోదాలు చేస్తోంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ ఫిర్యాదు మేరకే స్టాలిన్ నివాసంలో సిబిఐ సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డిఎంకె అధ్యక్షుడు కరుణానిధి బంధువుల ఇళ్లల్లో కూడా సిబిఐ అధికారులు సోదాలు జరుపుతున్నారు.

విదేశీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సిబిఐ ఈ సోదాలు చేస్తోంది. యూపిఏ సర్కారుకు డిఎంకె మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత రోజే స్టాలిన్ నివాసంపై సిబిఐ దాడులు జరుగుతుండటం గమనార్హం. డిఎంకె మద్దతు ఉపసంహరణ నేపథ్యంలో ఆ పార్టీ నేతల కేసులను తిరగదోడే అవకాశాలు ఉన్నాయని నిన్నటి నుండే ప్రచారం సాగింది. కరుణ తనయ కనిమొళి, 2జి కుంభకోణంలో ఇరుక్కున్న మాజీ మంత్రి రాజా తదితరులపై మరోసారి కేంద్రం కొరడా ఝులిపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

తన నివాసంలో సిబిఐ దాడులకు కారణాలేంటో తెలియవని, దీనిని తాను న్యాయస్థానంలో తేల్చుకుంటానని స్టాలిన్ చెప్పారు. సిబి సోదాల పైన డిఎంకె పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కారణాలతోనే స్టాలిన్ ఇంటిపై సిబిఐ అధికారులు దాడి చేస్తున్నారని విమర్శిస్తున్నారు. సిబిఐ సోదాల నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు స్టాలిన్ నివాసానికి చేరుకున్నారు. మరోవైపు కక్ష సాధింపు చర్యలనే విమర్శల నేపథ్యంలో సిబిఐ స్టాలిన్ ఇంట్లో సోదాలను నిలిపివేసింది.

దాడులపై చిదంబరం

ప్రస్తుతం స్టాలిన్ నివాసంలో జరుగుతున్న సోదాలపై అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయని చిదంబరం అన్నారు. స్టాలిన్ నివాసంలో సిబిఐ దాడులను తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ఇది ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళ్లే అవకాశముందన్నారు. ఓ తమిళుడిగా శ్రీలంక తమిళుల విషయంపై సభలో తీర్మానం పెట్టాలని తనకు ఉందని కానీ, పార్టీలు కలిసి రావడం లేదన్నారు.

English summary
Two days after Dravida Munnetra Kazhagam (DMK) pulled out its support from Congress-led UPA government, the "lame duck" government showed its former ally that it has not become weak after the political "divorce".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X