జగన్ కేసులో కీలక మలుపు: కెవిపికి సిబిఐ నోటీసులు

KVP Ramachandra Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు కీలక మలుపు తిరుగుతోంది. జగన్ కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో శనివారం ఉదయం పది గంటల సమయంలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని సిబిఐ అందులో ఆదేశించింది.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో కెవిపి రామచంద్ర రావు చక్రం తిప్పారనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ యంత్రాంగంలో ఆయన కీలకంగా వ్యవహరించారట. ఈ నేపథ్యంలో జగన్ ఆస్తుల కేసులో కెవిపి రామచంద్ర రావుకు సిబిఐ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ తదితరులు జగన్ ఆస్తుల కేసులో కెవిపిని విచారించాలని ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు.

వైయస్‌కు కెవిపి ఆత్మబంధువుగా ముద్రపడ్డారు. వైయస్ హయాంలో ప్రభుత్వంలో ఆయనే కీలకం. ఎవరైనా వైయస్ రాజశేఖర రెడ్డిని కలువాలన్నా మొదట కెవిపిని కలవాలనే వాదన ఉంది. అలాంటి కెవిపికి జగన్ కంపెనీలలోకి వచ్చిన పెట్టుబడులపై తెలిసి ఉంటుందని సిబిఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను విచారించేందుకు సిద్ధమైంది. వైయస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన కెవిపి ఆయన మృతి తర్వాత జగన్ బయటకెళ్లి కొత్త కుంపటి పెట్టుకున్నా ఇతను మాత్రం కాంగ్రెసులోనే కొనసాగుతున్నారు.

సహకరిస్తా: కెవిపి

జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తానని రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు చెప్పారు. కాగా, కెవిపికి పదిహేను రోజుల క్రితమే సిబిఐ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+