రాజమండ్రి మురళీ మోహన్‌కే, గొల్లపల్లికి అమలాపురం

అన్నింటిని బేరీజు వేసుకొని చంద్రబాబు పలువురి అభ్యర్థిత్వాలను ఖరారు చేసుకున్నారట. అయితే, వాటిని ఎప్పుడు విడుదల చేస్తారనేది సస్పెన్స్‌గా కొనసాగుతోంది. దాదాపు సగానికి పైగా లిస్ట్ ఎప్పుడో తయారయినప్పటికీ ఇదిగో ప్రకటన వెలువడుతుందనే వార్తలు వస్తున్నాయే తప్ప ఇంకా ప్రకటించలేదు. వస్తున్నా మీకోసం పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు తన యాత్రలో ఆయా నియోకవర్గాల్లో నిలబెట్టాల్సిన అభ్యర్థి పైన కూడా కసరత్తు చేస్తున్నారు.
తాజాగా చంద్రబాబు చంద్రబాబు పార్లమెంటు నియోజకవర్గానికి ఇంఛార్జిగా నియమించారు. వచ్చే ఎన్నికల్లో వారే పోటీ చేయనున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు రాజమండ్రి, అమలాపురం పార్లమెంట్ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారు. రాజమండ్రికి ఇప్పటికే ప్రజల్లో పనిచేస్తున్న ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్‌ను పేరును గతంలోనే ఖరారు చేశారు.
అమలాపురం లోక్‌సభ నియోజక వర్గానికి గొల్లపల్లి సూర్యారావును ఇంఛార్జిగా నియమించారు. అంతేకాక ఆయనే పార్టీ అభ్యర్థి అని ప్రకటించారు. రాజమండ్రిలో గురువారం జరిగిన కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు తన నిర్ణయాన్ని వెల్లడించారు. సూర్యారావుకు మాజీ మంత్రిగా అనుభవం ఉండడమే కాక పలుకుబడి, సమర్థత ఉన్న నాయకుడన్నారు. బాలయోగిలా ధైర్యంగా పనిచేయాలని సూర్యారావుకు సూచించారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications