ఎన్టీఆర్ విగ్రహంపై ఒక్కరికేనా?: పురంధేశ్వరితో బాబు ఢీ

ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేసే అవకాశం ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీకి లేదా ఆయన కుటుంబానికి ఇవ్వాలన్నారు. అలాకాకుండా ఓ వ్యక్తికి ఇవ్వడమేమిటని ఆయన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ ఇప్పటికైనా నిష్పక్షపాతంగా వ్యవహరించి విగ్రహ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంటులో త్వరగా ఏర్పాటు చేయాలని కోరారు.
టిడిపి తరఫునే...
పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తమ పార్టీకే అవకాశం ఇవ్వాలని టిడిపి ఎంపీలు నామా నాగేశ్వర రావు కోరారు. ఆయన చంద్రబాబు రాసిన లేఖను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్టీఆర్‌తో పాటు అల్లూరి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కరికే అవకాశం ఇవ్వడం సరికాదన్నారు. పార్టీకి లేదా కుటుంబానికి ఇవ్వాలని ఆయన కోరారు.
విద్యుత్ సమస్య తీవ్రత దృష్ట్యా రాష్ట్రానికి గ్యాస్, బొగ్గు కేటాయించాలని నామా నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. మన రాష్ట్రంలో లభ్యమయ్యే గ్యాస్, బొగ్గు మనకు కేటాయించకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications