వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్‌లకు మమతా బెనర్జీ కొత్త భాష్యం: జనాభాకు లింక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Mamata Banerjee
కోల్‌కతా: అత్యాచారాల పెరుగుదలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొత్త భాష్యం చెప్పారు జనాభా పెరుగుతోంది కాబట్టి అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆమె శుక్రవారంనాడు అన్నారు కోల్‌కతాలో 2012 నవంబర్ వరకు అత్యాచారాల కేసులు 45 మాత్రమే నమోదు కాగా, అదే కాలంలో ఢిల్లీలో 621 కేసులు నమోదయ్యాయని ఆమె చెప్పారు.

"జనాభా పెరుగుతోంది. బిదాన్ చంద్ర రాయ్ కాలంలో ఉన్నంత జనాభా మాత్రమే ఇప్పుడు ఉందా? శాంతిభద్రతలపై మీరు చాలా ప్రశ్నలు వేశారు. అత్యాచారాలు పెరుగుతున్నాయని మీరు అంటున్నారు" అని ఆమె శానససభలో అన్నారు. "జానాభా పెరుగుతోంది. కార్లు పెరుగుతున్నాయి. మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయి. షాపింగ్ మాల్స్ పెరుగుతున్నాయి. మల్టిప్లెక్స్‌లు వస్తున్నాయి. యువత ఆధునికులు అవుతున్నారు. దాన్ని స్వాగతించరా" అని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ ఆమె అన్నారు.

అత్యాచారాల కేసులను మీడియా ఎక్కువ చేసి చూపిస్తోందని ఆమె విమర్శించారు. అటువంటి కేసులపై ఫిర్యాదు చేయాలంటే మహిళలు ఇంతకు ముందు సిగ్గుపడేవారని ఆమె అన్నారు. సామాజిక చైతన్యం పెరుగుతోందని, దాంతో ఫిర్యాదులు చేస్తున్నారని, ఇది మంచి పరిణామమని, ఇంతకు ముందు ఫిర్యాదులు కూడా నమోదయ్యేవి కావని ఆమె అన్నారు.

రాష్ట్రంలో అత్యాచారాలు కేసులు నమోదైన తీరును వివరిస్తూ మమతా బెనర్జీ లెక్కలు కూడా ఇచ్చారు. కోల్‌కతాలో నమోదైన అత్యాచారాల కేసులను ముంబై, ఢిల్లీ, బెంగళూర్, చెన్నైల్లో నమోదైన కేసులతో గణాంకాలతో పోల్చి వివరించారు.

English summary
West Bengal Chief Minister Mamata Banerjee on Friday linked rising cases of rapes to increase in the population, while claiming that there were only 45 such cases till November 2012 in Kolkata in comparison to 621 in Delhi in the same year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X