అఫ్జల్ గురు ఉరి తర్వాత యాకూబ్ ఉపవాసం

తనకు ఉరిశిక్ష వేస్తూ సుప్రీం తీర్పు చెప్పిన తర్వాత యాకూబ్ ఏమాత్రం లెక్కచేయకుండా గంభీరంగా మారిపోయాడు. అఫ్జల్ గురును ఉరితీసిన సమయంలో యాకూబ్ నాగపూర్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. అఫ్జల్‌ను ఉరితీసిన తర్వాత మూడు రోజుల పాటు యాకూబ్ కఠిన ఉపవాసం చేశాడని చెబుతున్నారు.
జైలులో మేగజైన్లు, పుస్తకాలు చదువుతూ, జైలు అధికారులతో పలు విషయాలపై లోతుగా చర్చించడానికి ఆసక్తి చూపే యాకూబ్, తనకు ఉరిశిక్ష పడినా చలించలేదు. కానీ అఫ్జల్ ఉరితో అంతగా చలించిపోవడం అంతుబట్టనిదేనని జైలు అధికారులు అంటున్నారు.
యాకూబ్ మెమొన్ తెల్ల దుస్తులు ధరించడానికే ఇష్టపడుతున్నాడట. తన కేసు విషయంలో ఏం జరగనుందో యాకూబ్‌కు ముందే తెలిసి ఉంటుందని అంటున్నారు. నాగపూర్ సెంట్రల్ జైలులో చివరిసారి 1984లో ఉరిశిక్ష అమలైంది. హత్య కేసులో అమరావతికి చెందిన వాంఖడే సోదరులకు ఉరిశిక్ష అమలు చేశారు.












Click it and Unblock the Notifications