వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి ఎమ్మెల్సీ కన్నుమూత: బాబు, కిరణ్ సంతాపం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pogaku Yadagiri
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యుడు పొగాకు యాదగిరి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన శనివారం సాయంత్రం ఆరు గంటల నలభై అయిదు నిమిషాలకు స్వగృహంలో మృతి చెందారు. ఆయన వయసు 65. శాసన మండలి సభ్యుడిగా ఉన్న ఆయన పదవీ కాలం ఈ నెలాఖరుకు ముగియనుంది. దాదాపు ఏడాది కాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో యాదగిరి బాధపడుతున్నారు.

ఈ క్రమంలో గుండెపోటు రావడంతో శనివారం కన్నుమూశారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో పుట్టిన యాదగిరి అక్కడ న్యాయవాదిగా పనిచేశారు. తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత పార్టీలో చేరారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆయనను పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. శాసనమండలి సభ్యుడిగా కూడా అవకాశం ఇచ్చారు. అనంతరం టిటిడి పాలకమండలి సభ్యుడిగా, పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడిగా, రాష్ట్ర కార్యాలయ ఆహ్వాన కమిటీ ఛైర్మన్‌గా వివిధ రకాల పదవులు నిర్వహించారు.

పార్టీలో చురుకైన నేతగా గుర్తింపు పొందారు. 2007లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు జయరాం ప్రస్తుతం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. యాదగిరి భౌతిక కాయానికి ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తిరుమలగిరి ఆర్టీసీ కాలనీ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

యాదగిరి మరణం పట్ల పారట్ీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి యాదగిరి క్రియాశీలకంగా పనిచేశారని గుర్తు చేశారు. యాదగిరి మృతి పార్టీకి తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. యాదగిరి మృతికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, టిడిపి నేతలు దేవేందర్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర రావు తదితరులు సంతాపం తెలిపారు.

English summary

 Telugudesam Party senior leader and MLC Pogaku Yadagiri died on Saturday evening at his residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X