వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై అందుకే మాట్లాడట్లేదు: జైపాల్, జగన్‌పై కోట్ల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jaipal Reddy - Kotla Suryaprakesh Reddy
మహబూబ్‌నగర్/కర్నూలు: తాను అధికార పార్టీలో ఉన్నందు వల్లనే తెలంగాణపై మాట్లాడలేకపోతున్నామని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఆదివారం అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తిలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని జైపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను కల్వకుర్తి ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. కల్వకుర్తి తనకు రాజకీయ పాఠశాల అన్నారు.

పుస్తకాలను చదివి రాజకీయాలు చేయలేమన్నారు. కల్వకుర్తిలో తాను 17 ఏళ్లు రాజకీయ తపస్సు చేశానని చెప్పారు. అలాంటి తనకు ఎంతో ముఖ్యమన్నారు. కల్వకుర్తి ఎత్తి పోతల పథకానికి మహాత్మ గాంధీ ఎత్తిపోతల పథకంగా నామకరణం చేసి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కట్ చేశారన్నారు. తాను తెలంగాణవాదినని, పాలకపక్షంలో ఉన్నందువల్లే మాట్లాడలేక పోతున్నానని, తెలంగాణ కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమానికి జైపాల్ రెడ్డితో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానా రెడ్డి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డిలు హాజరయ్యారు. ముందుకు తనకు తెలుపలేదనే అసంతృప్తితో ఉన్న సమాచార శాఖ మంత్రి డికె అరుణ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరు కాలేదు.

జగన్ పార్టీ అధికారంలోకి రాదు

కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎట్టి పరిస్థితుల్లోను అధికారంలోకి రాదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆదివారం కర్నూలు జిల్లాలో అన్నారు. కాంగ్రెసు పార్టీని వీడిన వారు తమ తప్పులను తెలుసుకొని తిరిగి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు.

English summary

 Central Minister Jaipal Reddy has clarified his Telanganam on Sunday in Mahaboobnagar district. He said he is not joining in Telangana agitation by he is in ruling party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X