వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంజయ్ దత్‌కి క్షమాభిక్ష: బిజెపి వర్సెస్ కాంగ్రెస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sanjay Dutt
న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌కి క్షమాభిక్ష విషయంలో అధికార కాంగ్రెసు, ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీల మధ్య పరోక్షంగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. సంజయ్ దత్‌కి క్షమాభిక్ష పెడితే బాగుంటుందని కాంగ్రెసు పార్టీ నేతలు అభిప్రాయపడితే ఎందుకు పెట్టాలని బిజెపి ప్రశ్నిస్తోంది. కేంద్రమంత్రి దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ... సంజయ్ దత్ క్రిమినలే కానీ ఉగ్రవాది కాదని చెప్పారు.

ఆయనకు క్షమాభిక్ష పెడితే తప్పులేదని అభిప్రాయపడ్డారు. ముప్పై మూడేళ్ల వయస్సులో ఆయన చేసిన దానికి శిక్షించడమన్న దానిపైన అందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. దిగ్విజయ్ వ్యాఖ్యల పైన బిజెపి మండిపడింది. సంజయ్ దత్‌కు క్షమాభిక్ష అవసరం లేదన్నారు. సంజయ్ దత్‌కి క్షమాభిక్ష పెడితే బాధితుల కుటుంబాలని అవమానపర్చినట్లేనని ప్రధాన ప్రతిపక్షం అభిప్రాయపడింది.

సంజయ్ దత్ పైన ఉన్న దయ బాధితుల పైన ఎందుకు లేదని ప్రశ్నించింది. సంజయ్ దత్‌కి క్షమాభిక్ష పెడితే బాధితులను అవమానపర్చినట్లేనని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్ఎస్ఎస్) అభిప్రాయపడింది. సంజయ్ దత్‌కి క్షమాభిక్ష పెట్టాల్సిన అవసరం లేదని పేర్కొంెది.

సంజయ్ దత్‌కి క్షమాభిక్ష ప్రసాదించే అధికారం మహారాష్ట్ర గవర్నర్‌కు లేదని సీనియర్ న్యాయవాది, బిజెపి నేత మహేష్ జెత్మలానీ అన్నారు. సంజయ్‌కు క్షమాభిక్ష వ్యవహారంలో భారత ప్రెస్ కౌన్సెల్ చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ వైఖరిని తప్పు పట్టారు. క్షమాభిక్ష పెడితే తాను కోర్టులో సవాల్ చేస్తానని జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి ఇప్పటికే ప్రకటించారు.

English summary
Congress leader Digvijaya Singh Saturday came out in support of the demand to pardon Bollywood actor Sanjay Dutt, who has been sentenced to five year's imprisonment under the Arms Act in the 1993 Mumbai serial blasts case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X