విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాని కోసం.. వంశీకి చంద్రబాబు బుజ్జగింపు, ప్రమోషన్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-Vallabhaneni Vamsi
హైదరాబాద్/విజయవాడ: తెలుగుదేశం పార్టీ విజయవాడ పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వంశీని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుజ్జగిస్తున్నారట. గత ఎన్నికల్లో వంశీ గన్నవరం టిక్కెట్ ఆశించారు. అయితే, బాబు మాత్రం ఆయనను ఒప్పించి విజయవాడ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేయించారు. గన్నవరం నుండి దాసరి బాలవవర్ధన రావు పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు అదే గన్నవరం టిక్కెట్ పైన బాబు తల పట్టుకుంటున్నారట.

వంశీ గన్నవరం టిక్కెట్ కోసం పట్టుబట్టినప్పుడు వచ్చేసారి తప్పకుండా ఇస్తానని చెప్పిన చంద్రబాబు అప్పుడు దాసరిని బరిలోకి దింపారు. ఆయనను పట్టణ అధ్యక్షుడిగా చేశారు. అయితే, ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉండటంతో కృష్ణా జిల్లా టిడిపిలో టిక్కెట్ల కోసం మరోమారు రగడ ప్రారంభమైనట్లుగా కనిపిస్తోంది. విజయవాడ లోకసభ స్థానానికి కేశినేని నాని ప్రకటించారు. ఈ స్థానం కోసమే నాని పట్టుబడుతున్నారు.

టిక్కెట్ ఇస్తానని బాబు నుండి హామీ రావడంతో తన వర్గానికి చెందిన వ్యక్తినే టిడిపి అర్భన్ అధ్యక్షుడిగా ఉంచాలని అలా అయితేనే తనకు గెలుపు సులువు అవుతుందని ఆయన బాబుకు చెప్పారట. దీంతో ఇప్పుడు పట్టణ అధ్యక్షుడిగా ఉన్న వంశీని బుజ్జగించే పనిలో పడ్డారట. పట్టణ అధ్యక్ష పదవిని మరొకరికి ఇచ్చి రాష్ట్ర కమిటీలోకి తీసుకుంటానని వంశీకి సూచించారట. ఈ విషయంలో వంశీకి నచ్చజెప్పే పనిలో చంద్రబాబు ఉన్నారట.

అదే సమయంలో 2014లో గన్నవరం టిక్కెట్ తనకు ఇస్తానని చెప్పిన హామీని బాబుకు వంశీ గుర్తు చేశారట. అంతేకాకుండా వంశీకి గన్నవరం టిక్కెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఇది సిట్టింగ్ ఎమ్మెల్యే బాలవర్ధన రావుకు రుచించలేదు. ఇప్పటికే జగన్ వైపుకు వెళ్తారనే ప్రచారం వంశీపై సాగింది. గన్నవరంపై ఆశలు పెట్టుకున్న వంశీ అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ సీటును వదులుకునేందుకు బాలవర్ధన రావు కూడా సిద్ధంగా లేరు. వంశీకి టిక్కెట్ ఇచ్చారనే ప్రచారం సాగినప్పటికీ బాలవర్ధన రావుకు కూడా కొట్టి పారేసే పరిస్థితి లేదు. దీంతో ఆఖరుకు ఎవరికి టిక్కెట్ వస్తుందనేది తేలాల్సి ఉంది.

English summary
It is said that Telugudesam Party chief Nara Chandrababu Naidu is wooing Vallabhaneni Vamsi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X