రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టూరిజం బస్సుపై దాడి: భార్యను చంపిన భర్త ఆత్మహత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Delhi Metro Station firing: Murderer commits suicide
హైదరాబాద్/రాజమండ్రి/న్యూఢిల్లీ: మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ బస్సు పైన కొందరు దుండగులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణీకులు గాయపడ్డారు. బస్సు షిర్డి నుండి హైదరాబాద్ వస్తుండగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇది జరిగింది. బస్సు హైదరాబాద్ తిరిగి వస్తుండగా.. ఒక్కసారిగా టైర్ పేలిన శబ్ధం వినిపించింది. డ్రైవర్ బస్సు కిందకు దిగి టైర్ పేలిందేమోనని చూస్తే పేలలేదు.

దీంతో అతను తిరిగి బస్సు ఎక్కుతుండగా పదిహేను మంది వరకు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, కర్రలతో బస్సుపై దాడి చేశారు. ఇది గుర్తించిన డ్రైవర్ వెంటనే బస్సు ఎక్కి వేగంగా పోనిచ్చాడు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన షోలాపూర్ సమీపంలో జరిగింది. డ్రైవర్, ప్రయాణీకుల దగ్గర్లోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే తమ పరిధి కాదని పోలీసులు నిరాకరించారు. దీంతో ఈరోజు హైదరాబాద్ వచ్చాక ఇక్కడ ఫిర్యాదు చేశారు.

ఇరువర్గాల మధ్య ఘర్షణ

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మున్సిపల్ కాలనీలో బుధవారం ఉదయం ఘర్షణ నెలకొంది. ఇరు వర్గాలు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తలించారు.

తూర్పు గోదావరి జిల్లాలో నరసాపురం నుండి సఖినేటిపల్లి వస్తున్న ఓ పడవ సాంకేతిక లోపంతో గోదావరి మధ్యలో చిక్కుకుపోయింది. బోటులో దాదాపు వందమంది ప్రయాణీకులు ఉన్నారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

భార్యను చంపిన భర్త ఆత్మహత్య

మంగళవారం ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో భార్యపై కాల్పులు జరిపి ఆమె మరణానికి కారణమైన పవన్ కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. యుపి మురాద్ నగర్‌లో ఓ రైల్వే స్టేషన్ సమీపంలో చెట్టుకు ఉరేసుకొని అతను ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యాభర్తల మధ్య ఆస్తి వివాదమే ఈ ఆత్మహత్య, హత్యకు కారణంగా తెలుస్తోంది. కోర్టు నుండి బయటకు వచ్చి ఇంటికి వెళ్తుండగా పవన్ తన భార్య, మామలపై కాల్పులు జరిపినట్లుగా సమాచారం.

English summary

 In a twist to the firing at Delhi metro station which took place on Tuesday, the murderer has now committed suicide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X