విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాటిచ్చారు, మాట్లాడించలేదు: బాబుపై వంశీ అసంతృప్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vallabhaneni Vamsi-Chandrababu Naidu
విజయవాడ: కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి వల్లభనేని వంశీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన తన అసంతృప్తిని బుధవారం వ్యక్తం చేశారు. జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం టిక్కెట్ తనకే ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని కానీ, ఈ విషయమై సిట్టింగ్ శాసనసభ్యుడు దాసరి బాలవర్ధన రావును తనతో మాట్లాడించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దాసరి బాలవర్ధన రావుతో మాట్లాడిస్తే తనకు పూర్తి నమ్మకముంటుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రగ కార్యనిర్వాహక కార్యదర్శి పదవి రాష్ట్రంలో ఎంతో మందికి ఉందన్నారు. విజయవాడ పట్టణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తాను ఎంతో కృషి చేశానని చెప్పారు. పార్టీ అభివృద్ధి కోసం ఎంతగా కృషి చేసినా పార్టీ అధిష్టానం మాత్రం తనకు ఏమాత్రం గౌరవం ఇవ్వలేదని ఆయన అన్నారు.

కాగా, కృష్ణా జిల్లా విజయవాడ లోకసభ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జిగా కేశినేని నాని నియమితులైన విషయం తెలిసిందే. కేశినేని నాని విజ్ఞప్తి మేరకు చంద్రబాబు విజయవాడ పట్టణ శాఖ టిడిపి అధ్యక్షుడిగా నాగుల్ మీరాని నియమించారు. ఇంతకుముందున్న వల్లభనేని వంశీమోహన్‌ను పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వర్గంలోకి తీసుకున్నారు.

గత ఎన్నికల్లో వంశీ విజయవాడ నుండి పోటీ చేసినప్పటికీ ఆయనకు అక్కడి నుండి ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేదు. ఆయన మొదటి నుండి గన్నవరం టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. ఆ స్థానాన్ని వదులుకునేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన రావు సిద్ధంగా లేరు. అయితే, వంశీకి గన్నవరంపై బాబు హామీ ఇచ్చి దాసరిని బుజ్జగిస్తున్నట్లుగా తెలుస్తోంది.

English summary
Telugudesam Party senior leader Vallabhaneni Vamsi expressed his dissatisfaction on party chief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X