నాడు పురంధేశ్వరి ఎవరికి తెల్సు!: టిఎస్సార్ సంచలనం

Purandeswari - T Subbirami Reddy
విశాఖపట్నం: రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డి కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం, టిఎస్సార్ సేవా పీఠం సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2004 ఎన్నికల వరకు పురందేశ్వరి ఎవరో కూడా చాలా మందికి తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే నాటి ఎన్నికల సమయంలో ఆమె కాంగ్రెస్‌లోకి వస్తే బావుంటుందని తనతో పాటు మరికొందరు పార్టీ పెద్దలు భావించి, ఆహ్వానించామన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేసి తీరతానని, కేంద్రమంత్రి పురందేశ్వరి నర్సరావుపేట నుంచి పోటీ చేస్తారంటూ పలు సందర్భాల్లో టిఎస్సార్ ప్రకటించిన విషయం తెలిసిందే.

పురందేశ్వరి తనకు సోదరితో సమానమని, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు తనకు ఆప్తమిత్రుడన్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేసే ఉద్దేశం పురందేశ్వరికి లేకున్నా.. కొంతమంది మీడియా మిత్రులు ఆమెతో ఏదో ఒకటి మాట్లాడిస్తున్నారని ఆయన అన్నారు.

ఏప్రిల్ 20న టిఎస్సార్ జాతీయ సినిమా అవార్డులను ప్రదానం చేస్తామని వెల్లడించారు. దీని కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీకి తాను చైర్మన్‌గా వ్యవహరిస్తానని చెప్పారు. ఏప్రిల్ 12న విశాఖలో టిఎస్సార్ ఉగాది పురస్కారాలు అందజేస్తామని, ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ను ఈ సందర్భంగా ఘనంగా సత్కరిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+