గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరు సాఫ్టువేర్ ఇంజనీర్ అమెరికాలో అదృశ్యం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Guntur District
వాషింగ్టన్/గుంటూరు: గుంటూరు జిల్లాకు చెందిన ఓ సాఫ్టువేర్ ఇంజనీర్ అమెరికాలో అదృశ్యమయ్యాడు. గుంటూరు జిల్లాకు చెందిన శరత్ కుమార్ అనే యువకుడు చికాగోలోని టిసిఎస్ సంస్థలో సాఫ్టువేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అతను నయగారా జలపాతాన్ని చూసేందుకు వెళ్లారు. ఆదివారం పర్యటన కోసం వెళ్లిన శరత్ కుమార్ ఆ తర్వాత తిరిగి రాలేదు.

నయగారా జలపాతం చూసి తిరిగి వస్తున్న అతను వాషింగ్టన్ డిసిలో అదృశ్యమైనట్లుగా తెలుస్తోంది. అతను చికాగోలోని టిసిఎస్‌లో కొన్నేళ్లుగా ఉద్యోగం చేస్తున్నట్లుగా సమాచారం. శరత్ తిరిగి రాకపోవడంతో సహచరులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో గుంటూరులోని కుటుంబ సభ్యులు, అతని బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అతని కోసం గాలిస్తున్నారు.

కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటి విద్యార్థులు నాసా స్పేస్ సెటిల్మెంట్ డిజైన్ కాంటెస్ట్ 2013 పోటీలుకు ఎంపికయ్యారు. ఈ ఏడాది 14 ప్రాజెక్టులతో 36 మంది ఎంపికై రికార్డు సృష్టించారు. నూజివీడు ట్రిపుల్ ఐటి నుంచి విద్యార్థులకు నాసాకు ఎంపిక కావడం ఇది వరుసగా నాలుగోసారి. నాసా పోటీలకు ట్రిపుల్ ఐటి నుంచి మొత్తం 20 ప్రాజెక్టులు పంపగా వాటిలో 14 ఎంపికయ్యాయి.

గ్రేడ్ 11 విభాగంలో లక్ష్మీ ప్రసన్న రూపొందించిన టైటాన్(ది డ్రీమ్ వరల్డ్) ప్రాజెక్టుకు ప్రథమ బహుమతి వచ్చింది. గ్రేడ్ 12 విభాగంలో అమరాంతన్‌కు ద్వితీయ, అక్రాన్‌కు తృతీయ బహుమతులు లభించాయి. మే నెలలో 23-25 తేదీలలో వీరు తమ ప్రాజెక్టులను వివరించడానికి యూఎస్ఏ వెళ్లాల్సి ఉంటుంది.

English summary
A software professional hailing from Guntur has been reportedly missing from Washington in USA since Sunday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X