బొత్సది తప్పన్న చిరంజీవి: కెసిఆర్‌కు తలసాని సవాల్

Chiranjeevi - Talasani Srinivas Yadav
న్యూఢిల్లీ/హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల పెంపును సమర్థించిన ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిల వ్యాఖ్యలను కేంద్రమంత్రి చిరంజీవి బుధవారం తప్పు పట్టారు. విద్యుత్ ఛార్జీల పెంపు సబబే అని వారు చెప్పడం సరికాదన్నారు.

పేదలపై భారం పడకుండా ఉండాలంటే విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్యను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసమర్థతేనా? అన్న ప్రశ్నకు చిరంజీవి సమాధానం దాటవేశారు.

తాను ప్రజల తరఫున మాట్లాడుతున్నానని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు పార్టీ సమన్వయ కమిటీ, మంత్రివర్గంలో చర్చించాలని సూచించారు. విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిందని మీడియాలో వస్తున్నా వార్తలు అవాస్తవమని చెప్పారు. జనవరి, ఫిబ్రవరిలో దేశంలో విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గలేదన్నారు.

చిరు వ్యాఖ్యలపై బొత్స

చిరంజీవి వ్యాఖ్యలను వక్రీకరించాల్సిన అవసరం లేదని బొత్స సత్యనారాయణ అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆందోళన వద్దన్నారు. విద్యుత్ సమస్యలపై వైయస్ రాజశేఖర రెడ్డి తనతో మాట్లాడినట్లుగా షర్మిల చెప్పడం విడ్డూరమన్నారు. ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం చూస్తుందన్నారు.

కెసిఆర్‌కు తలసాని సవాల్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ చేశారు. కెసిఆర్‌కు దమ్ముంటే సికింద్రాబాదు నుండి పోటీ చేయాలని సవాల్ చేశారు. ఇక్కడి నుండి ఓడిపోతే కెసిఆర్ రాజకీయ సన్యాసం తీసుకోవాలన్నారు. ఇకనైనా తెరాస టిడిపిపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+