చంపుతానని బెదిరించాడు: జిమ్ ఇన్‌స్ట్రక్టర్‌పై బిటెక్ గర్ల్

అందులో భాగంగానే అతను తనను తన ఇంటికి తీసుకు వెళ్లాడని, అతని ఇంటికి వెళ్లగానే తాను అతని మనసులో ఉన్నది గ్రహించి అక్కడి నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించానని చెప్పారు. తాను తప్పించుకోవడానికి ప్రయత్నించేలోగానే అతను తనపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపారు.
నిందితుడు ప్రశాంత్ రెడ్డిది నల్గొండ జిల్లా. అతని వయస్సు 26. ఇతను వనస్థలిపురంలోని జిమ్‌లో ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తున్నాడు. అత్యాచారం అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని తనను బెదిరించాడని బాధితురాలు తెలిపారు. ప్రశాంత్ రెడ్డి బాధితురాలి బాయ్ ఫ్రెండ్ స్నేహితుడు.
ఇతను తన స్నేహితుడితో కలిసి గతంలో బాధితురాలిని కలిశాడు. ఆదివారం ఆమెను బాలాజీనగర్‌లోని తన ఇంటికి తీసుకు వెళ్లాడు. బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎల్బీ నగర్ పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఎల్బీ నగర్ పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.
కాగా, ఓ బిటెక్ విద్యార్థినిపై జిమ్ యజమాని హైదరాబాదులోని ఎల్బీ నగర్‌లో ఆదివారం అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. 21 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని ఎల్బీనగర్‌లోని భవానీనగర్‌లో ఉంటోంది. నిందితుడు ప్రశాంత్ రెడ్డితో ఆమెకు పాత పరిచయం ఉంది. ఆదివారం సాయంత్రం ప్రశాంత్ రెడ్డి అమ్మాయిని ఎల్బీనగర్ బాలాజీనగర్‌లో గల తన ఇంటికి పిలిచాడు. తన జిమ్‌లో సాధన చేస్తున్న ఆమె బాయ్‌ఫ్రెండ్ గురించి ముఖ్యమైన విషయాలు కొన్ని చెప్తానని అతను ఆమెను తన ఇంటికి పిలిచి అత్యాచారం చేశాడు.












Click it and Unblock the Notifications