రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేధింపులే: జయప్రద, జగన్ పార్టీ రాజమండ్రి టిక్కెట్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan - Jayaprada
చిత్తూరు: యూపి రాంపూర్ ఎంపి జయప్రద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున రాజమండ్రి నుండి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు అలాగే కనిపిస్తున్నాయి. ఆమె తన పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌ను తాను తండ్రిలా భావిస్తే ఆయన మాత్రం తనను పార్టీ నుండి తరిమేశారని జయప్రద బుధవారం అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన వేధింపులను ప్రజలు అందరూ గమనిస్తున్నారని ఆమె చెప్పారు. తాను వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రానికి వస్తానని చెప్పారు. తూర్పు గోదావరి రాజమండ్రి పార్లమెంటు స్థానం నుండి తాను పోటీ చేస్తానని ఆమె ఈ సందర్భంగా చెప్పారు.

ఉత్తర ప్రదేశ్‌లో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదన్నారు. పార్లమెంటు సభ్యులకు కూడా అక్కడ ఏమాత్రం రక్షణ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను తెలుగు సినిమాలలో నటిస్తానని చెప్పారు. మహిళా బిల్లుకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాధీ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే ములాయం, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వారు అడ్డుకుంటున్నారన్నారు. కాగా, నిన్న ఆమె మాట్లాడుతూ సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్రానికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి లాంటి నేత కావాలని అభిప్రాయపడ్డారు.

సస్యశ్యామలమైన ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేసి అందరిలోను చిరస్థాయిగా నిలిచిన వైయస్ లాంటి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు జగన్ సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. చాలా రాజకీయ పార్టీల నుండి తనకు ఆహ్వానం ఉన్నా నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే పార్టీలో చేరుతానని చెప్పారు.

వైయస్‌కు కితాబివ్వడం, జగన్‌పై వేధింపులనడం అదే సమయంలో రాజమండ్రి నుండే బరిలోకి దిగుతానని చెప్పడం ద్వారా ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary

 Uttar Pradesh Rampur MP Jayaprada has blamed Mulayasm Singh Yadav and Lalu Prasad Yadav for women bill and praised AICC president Sonia Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X