టెక్కీ బస్సు నుంచి దూకాడు, మరణించాడు

మంగళవారం ఉదయం అమీర్‌పేటలో ఆర్టీసీ మెట్రో లైనర్ బస్సు ఎక్కాడు. రసూల్‌పురా వద్ద మధ్య డోర్ నుంచి దిగేందుకు ప్రయత్నించాడు. కిందపడడంతో బస్సు వెనుక చక్రం అతడి పైనుంచి వెళ్లింది. తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
సంఘటన జరిగిన వెంటనే డ్రైవర్ బస్సును వదిలేసి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి చూపుల కోసం సెలవు పెట్టి ఊరెళ్లాడని, మంగళవారమే నగరానికి వచ్చాడని సంస్థ ఉద్యోగులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు బేగంపేట ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
మరో సంఘటనలో ఎనిమిదో తరగిత విద్యార్థిని, ఆమె తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాదులోని ఆబిడ్స్‌లో వారు ప్రయాణిస్తున్న టూ వీలర్‌ను ఆర్టీసి బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఆగాపురాకు చెందిన నర్సింగరావు అనే వ్యక్తి తన కూతురు శిరీషను బుధవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు స్కూటర్‌పై పాఠశాలకు తీసుకుని వెళ్తుండగా ఆ ప్రమాదం జరిదింది.












Click it and Unblock the Notifications