వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్లెక్సీలో స్వర్గీయ ఎన్టీఆర్ ఫోటో: జగన్‌కు గాలి చురక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Muddukrishnma Naidu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన ఫ్లెక్సీలో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటో పెట్టుకోవంపై తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చురకలంటించారు. తమ పార్టీ నేత ఫోటో పెట్టుకోవడం జగన్ పార్టీ భావదారిద్రానికి నిదర్శనమన్నారు. జగన్ ఫోటో ఉంటే ఓట్లు రాలవనే ఉద్దేశ్యంతోనే వారు తమ ఫ్లెక్సీల్లో తమ నాయకుడు ఫోటోను పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేశారన్నారు. అలాంటి ఎన్టీఆర్ ఫోటోను దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటో పక్కన పెట్టడం విడ్డూరమన్నారు. వైయస్ ప్రజల సొమ్మును తన తనయుడు జగన్‌కు దోచి పెట్టిన వ్యక్తి అన్నారు. వైయస్‌కు, ఎన్టీఆర్‌కు ఏమాత్రం పోలిక లేదన్నారు.

ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టిందని మండిపడ్డారు. కాంగ్రెసు పాలనలో ముప్పై వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. ఆ రైతుల ఆత్మహత్యలు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్‌లో ఆత్మలుగా తిరుగుతున్నాయన్నారు. విద్యుత్ సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో జగన్ తన పవర్ ప్రాజెక్టుల నుండి రాష్ట్రానికి విద్యుత్ ఇవ్వవచ్చు కదా అని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ ఫోటో పెట్టుకునే దుస్థితికి.. కన్నా

వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి నైతిక సిద్ధాంతాలు ఏమాత్రం లేవని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ గుంటూరు జిల్లాలో విమర్శించారు. టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఫోటో ప్రచారం చేసుకునే పరిస్థితికి వారు దిగజారారని ఎద్దేవా చేశారు.

English summary

 Telugudesam Party senior leader Gali Muddukrishnma Naidu has said that YSR Congress Party is using late NTR photo for attract voters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X