హీరో నాగార్జున భూవ్యవహారాలపై విచారించండి: రేవంత్

Nagarjuna - Revanth Reddy
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున భూ వ్యవహారాల పైన రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గురువారం డిమాండ్ చేశారు. రాజధాని నడిబొడ్డున హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న గురుకుల ట్రస్టు భూముల్లో నాగార్జున ఆక్రమణకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. అక్కడ తన భూమికి ఆనుకొని ఉన్న చెరువును పూడ్చి పధ్నాలుగు ఎకరాలు ఆక్రమించారన్నారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని పట్టుకొని దాన్ని రెగ్యులరైజ్ చేయించుకున్నారని విమర్శించారు. సినిమాల నిర్మాణం కోసం అన్నపూర్ణ స్టూడియోకు భూమిని తీసుకుని అందులో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్నారు. అందులో పెట్టిన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో పేదలకు రాయితీ ఇస్తారా? అని అడిగితే నాణ్యత పడిపోతుందని నాగార్జున చెప్పారన్నారు.

ఆక్రమించుకొన్న భూములను క్రమబద్ధీకరించుకొంటే న్యాయం... పేదల పిల్లలకు రాయితీ ఇస్తే అన్యాయమా అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సన్నాసి అనే ఆయనకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

టిడిపి సన్నాసుల పార్టీ అని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. రేవంత్ ఈ వ్యాఖ్య చేశారు. సన్నాసుల మాటలకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకోవడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన కూడా మండిపడ్డ విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+