యుఎస్‌లో భార్యాపిల్లల హత్య: సిఐడికి చిక్కిన టెక్కీ

ఆంధ్రప్రదేశ్ కు చెందిన టెక్కీ లక్ష్మీనివాస రావు నెరసుపై అధికారులు నాలుగేళ్ల క్రితం అరెస్టు వారంట్ జారీ చేశారు. భార్యను, ఇద్దరు పిల్లలను చంపినందుకు గాను ఈ త్రీ కౌంట్ అరెస్టు వారంట్ జారీ అయింది. నిరుద్యోగి అయిన కంప్యూటర్ ప్రోగ్రామర్ ఆర్థిక బాధలను తట్టుకోలేక డెట్రాయిట్ లోని నోవీలో తన ఇంటిలో 2008 అక్టోబర్ 27వ తేదీన తన భార్య జయలక్ష్మిని, తన ఇద్దరు పిల్లలు తేజస్వీ (14), శివకుమార్ (12)లను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి హత్య జరిగినప్పటి నుంచి లక్ష్మీ నివాసరావు కనిపించకుండా పోయాడు.
హత్యను అడ్డుకోవడానికి వారు ప్రయత్నించినట్లు చేతులపై వారికి ఉన్న గాయాలు తెలియజేస్తున్నాయి. తలపై, మెడపై గాయాలతో ఆ ముగ్గురు తమ ఇంటిలోని రక్తమడుగులో శవాలై పడి ఉన్నారు. హత్య చేసిన అనంతరం లక్ష్మీనివాస రావు అమెరికా నుంచి పారిపోయినట్లు కేసు దర్యాప్తు అధికారులు అనుమానించారు. లక్ష్మీనివాసరావు కోసం అంతర్జాతీయ స్థాయిలో వేట సాగించారు.
నిరుద్యోగి అయిన కార్తిక్ రాజారాం అనే ఎన్నారై తన భార్యను, ముగ్గురు కుమారులను, అత్త హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకుని మూడు వారాలు గడవక ముందే ఈ సంఘటన చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications