థానేలో ఏడంతస్తుల కూలిన భవనం: 39 మంది మృతి

గురువారం థానేలోని షీల్ థాయ్‌గర్‌లో నిర్మాణంలో ఉన్న ఈ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. 12 అగ్నిమాపక శకటాలు, 26 అంబులెన్సులతో ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపడుతున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ భవంతికి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు చెప్పారు.
పోలీసు అధికారి దిగంబర్ మాట్లాడుతూ.. 54 మంది ఈ ఘటనలో గాయపడ్డారని చెప్పారు. రెస్క్యూ టీం భవన శిథిలాల కింద ఉన్న వారి కోసం వెతుకుతోందని చెప్పారు. భవన నిర్మాణానికి స్థానిక అధికారులకు ఎలాంటి అనుమతులు లేవని చెప్పారు. మొదటి నాలుగు అంతస్తులలో ఇళ్లు, కార్యాలయాలు ఉన్నాయని చెప్పారు.
నాలుగు అంతస్తుల్లో పలువురు ఉంటున్నారని, తదుపరు మూడు అంతస్తులు కూడా కూలే సమయానికి పూర్తయ్యాయని, మరో అంతస్తు కోసం కూలీలు పని చేస్తున్నారని చెబుతున్నారు. దాదాపు 28 కుటుంబాలు భవనంలో అప్పటికే నివసిస్తున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications