• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఢిల్లీ యాత్ర: కోదండరామ్, రేణుకా చౌదరిపై న్యాయపోరు

By Pratap
|

Kodandaram
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసే ఉద్యమంలో భాగంగా ఈ నెలాఖరులో సంసద్ (పార్లమెంటు) యాత్ర నిర్వహిస్తామని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరాం చెప్పారు. ఇందులో భాగంగా రెండు రోజులపాటు ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో అన్ని ప్రతిపక్ష పార్టీలను కలిసి, తెలంగాణ వాదాన్ని పార్లమెంటులో వినిపించాలని కోరతామని తెలిపారు. తెలంగాణ జెఎసి విస్తృత స్థాయి సమావేశం తర్వాత ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

జెఎసి భాగస్వామ్య పార్టీల ప్రతినిధులు ఈటెల రాజేందర్, దాసోజు శ్రవణ్‌కుమార్ (తెరాస), అశోక్‌కుమార్ యాదవ్, సుధాకరశర్మ (బీజేపీ), కె.గోవర్ధన్, సంధ్య (న్యూ డెమోక్రసీ), ఉద్యోగ-ప్రజా సంఘాల నేతలు జి.దేవీప్రసాదరావు, కె.రవీందర్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్, కత్తి వెంకటస్వామి, మణిపాల్‌రెడ్డి, అద్దంకి దయాకర్, రసమయి బాలకిషన్, సత్యం, జేఏసీ జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. తొలిసారి తెలంగాణ నగారా సమితి ప్రతినిధులు హాజరయ్యారు.

ఒకవైపు ఢిల్లీపై, మరోవైపు సీమాంధ్ర పాలకులపై ఒత్తిడి పెంచేవిధంగా సంసద్ యాత్ర ఈనెల 20-30 తేదీల మధ్య ఉంటుందని, తేదీని ఒకటి, రెండు రోజుల్లో వెల్లడిస్తామని తెలిపారు. సంసద్ యాత్ర తర్వాత విజయవాడ సడక్ బంద్, అనంతరం 'చలో అసెంబ్లీ' నిర్వహించనున్నట్టు చెప్పారు. గ్రామస్థాయి నుంచి జేఏసీ నిర్మాణంపై దృష్టి పెట్టి, నెలాఖరులోగా పూర్తి చేస్తామని చెప్పారు.

పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టకపోతే కాంగ్రెస్ సంగతి పదునైన ఉద్యమం ద్వారా ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని ఈటెల రాజేందర్ చెప్పారు. కాగా, హైదరాబాద్-విజయవాడ సడక్ బంద్‌ను మే నెలలో రాత్రి వేళ నిర్వహించాలని జేఏసీ నిర్ణయించినట్టు సమాచారం. ఎండ తీవ్రతను, 'కర్నూలు' సడక్ బంద్ అనుభవాలను బేరీజు వేసుకొని ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సాయంత్రం వేళ విజయవాడ రహదారిపై 'సడక్ బంద్' మొదలుపెట్టి తెల్లవారుజామున వరకు దిగ్భందించాలని వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది.

జంతర్‌మంతర్‌లో రెండు రోజుల ధర్నా ముగిసిన తర్వాత అక్కడి నుంచి పార్లమెంటు ముట్టడికి తరలివెళ్లాలని వ్యూహరచన చేశారు. కనీసం 2వేల మందిని ఢిల్లీకి తరలించాలని నిర్ణయించారు. కాగా, తెలంగాణ కోసం ఆత్మహత్యలకు పాల్పడిన వారిపై అవమానకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యురాలు రేణుకా చౌదరిపై న్యాయపోరాటానికి సిద్ధం కావాలని, సూసైడ్ నోట్స్, ఎఫ్ఐఆర్‌లతో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana JAC chairman Kodandaram said that Samsad yatra will be taken up to achieve Telangana and will stage dharna. Telangana JAC has decided to take up legal fight against Congress MP Renuka Choudhary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more