విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దూరమేనా?: బాలయ్య వార్నింగ్, జూ ఎన్టీఆర్ డోంట్ కేర్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Balakrishna - Jr Ntr
హైదరాబాద్: నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ నేత బాలకృష్ణ హెచ్చరికలకు జూనియర్ ఎన్టీఆర్ డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా? అనే చర్చ సాగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీల ఫ్లెక్సీలలో ఇటీవల జూనియర్ ఫోటోలు కనిపిస్తున్న విషయం తెలిసిందే. బాద్ షా సినిమా విడుదల సమయంలోను పలువురు జగన్ పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ వేడి కృష్ణా జిల్లాలో ఎక్కువగా ఉంది.

ఫ్లెక్సీ రాజకీయాలపై జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడో బయటకు వచ్చి వివరణ ఇవ్వాల్సి ఉందని అంటున్నారు. ఆయన రాకపోయినా బాలకృష్ణ తన కృష్ణా జిల్లా పర్యటనలో శనివారం జూనియర్‌ను ఉద్దేశించి.. అతనే ఖండించాలని, లేదంటే ఎవరైనా తీవ్ర పరిణామాలు తప్పవని చెప్పారు. బాలయ్య ప్రకటన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ వెంటనే బయటకు వచ్చి వివరణ ఇస్తారని లేదంటే ఎవరితోనైనా ఇప్పిస్తారని భావించారు.

కానీ అలాంటిది జరగలేదు. దీంతో బాలయ్య హెచ్చరికను జూనియర్ ఎన్టీఆర్ డోంట్ కేర్ అన్న విధంగా తీసుకుని ఉండవచ్చునని అంటున్నారు. అందుకే అతను ఎలాంటి ఖండన ప్రకటన విడుదల చేయలేదని అంటున్నారు. ఫ్లెక్సీల అంశంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ పైన మండిపడుతున్నారని చెబుతున్నారు. ఆయన బయటకు రాకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

దూరం పెంచనుందా?

ఇప్పటికే బాలకృష్ణ, చంద్రబాబుల పట్ల జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తితో ఉన్నారనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఈ ఫ్లెక్సీల రాజకీయం బాలయ్య - జూనియర్‌ల మధ్య మరింత ఎడం పెంచే అవకాశాలు ఉన్నాయంటున్నారు. జూనియర్ ఖండన కోసం టిడిపి కార్యకర్తలు ఎదురు చూసినప్పటికీ అది కుదరదలేదు. అయితే, బాలయ్య కలుగజేసుకొని అతను బయటకు రావాల్సిందేనని లేదంటే చర్యలు తప్పవని చెప్పడం, జూనియర్ రాకపోవడం నేపథ్యంలో వారి ఎడం మరింత పెరిగి ఉంటుందని అంటున్నారు.

జగన్ పార్టీ నేతలు ఫ్లెక్సీలలో తన ఫోటోలు వినియోగించుకోవడాన్ని ఖండించేందుకు జూనియర్ సుముఖంగా ఉన్నారా లేదా అని అంటున్నారు. సుముఖంగానే ఉంటే ఇప్పటి వరకు ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. జూనియర్ ఉద్దేశ్యపూర్వకంగానే బయటకు రావడం లేదని అంటున్నారు.

English summary

 Nandamuri Hero Junior NTR is not responding on his babay Nandamuri Balakrishna comments against him over flexee politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X