చిరంజీవి ఎవరు?: కెకె ఘాటు వ్యాఖ్య, అదో మాఫియా

Chiranjeevi - K Keshava Rao
హైదరాబాద్/విజయవాడ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ అంశాలపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు ఆదివారం ఘాటుగా స్పందించారు. అదే సమయంలో తెలంగాణ ఆత్మహత్యలపై రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వ్యాఖ్యలను కూడా కేశవ రావు తీవ్రంగా తప్పు పట్టారు.

అన్నపూర్ణ స్టూడియోకి భూమి ఇవ్వడం ఓ నాన్సెన్స్ అని మండిపడ్డారు. సినిమాల పేరుతో ప్రస్తుతం నడుస్తున్నదంతా ఓ మాఫియానే అని ఆయన ఆరోపించారు. అసలు చిరంజీవి ఎవరంటూ ప్రశ్నించారు. దక్షిణాదివాళ్లమని తెలంగాణపై ఇంత నిర్లక్ష్యమా అని నిప్పులు చెరిగారు. రేణుకా చౌదరి తెలంగాణ ప్రజలకు కాంగ్రెసును దూరం చేయవద్దని, అదే అయితే ఆమె కాంగ్రెసు పార్టీకి వెన్నుపోటు పొడిచినట్లే అన్నారు. తెలంగాణ ఏర్పడితే అది భాషాప్రయుక్త రాష్ట్రమే అన్నారు. తెలంగాణ రాష్ట్ర డిమాండును తప్పు పట్టిన కట్జూ వ్యాఖ్యల పైనా కెకె మండిపడ్డారు.

జగన్ వర్గంపై ఫిర్యాదు చేశాం.. బొత్స

అవిశ్వాస తీర్మానం సమయంలో విప్ ధిక్కరించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తాము స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేశామని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం చెప్పారు. ఆయన ఈ రోజు విజయవాడలో పర్యటించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని, స్పీకర్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించినప్పటికీ విపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. వస్త్రాలపై వ్యాట్ రద్దు చేయాలనే వస్త్ర వ్యాపారుల డిమాండ్‌ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తాను తీసుకు వెళ్తానని చెప్పారు. వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. చట్టాన్ని ధిక్కరించి వ్యాపారం చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. టిడిపి ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని, ఒక్క ఎమ్మెల్యే పోయినంత మాత్రాన జిల్లాలో పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+