విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ వద్దన్నదే బాబు చేశారు, జగన్‌తో క్లోజ్: షర్మిల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sharmila
విజయవాడ: స్వర్గీయ నందమూరి తారక రామారావు ఏదైతో వద్దనుకున్నారో అదే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల శనివారం అన్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్న షర్మిల గుడివాడ బహిరంగ సభలో మాట్లాడారు. చంద్రబాబు ప్రజల్లో నుండి పుట్టిన నాయకుడు కాదన్నారు. ఆయన వెన్నుపోటు నుంచి వచ్చిన నాయకుడన్నారు.

ఆ నీచుని పతనం కళ్లారా చూస్తేగానీ తనకు మనశ్శాంతి ఉండదని స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారని షర్మిల అన్నారు. ఏ పార్టీ పైన కోపంతో ఎన్టీఆర్ పార్టీ పెట్టారో... ఆ పార్టీతోనే ఇప్పుడు చంద్రబాబు కుమ్మక్కయ్యారని, ఇది చాలా బాధాకరం అన్నారు. సర్కారుపై అవిశ్వాసానికి మద్దతివ్వకుండా ప్రజలకు మరోసారి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. బాబు రాజకీయ చరిత్రకు జగన్ త్వరలో ముగింపు పలుకబోతున్నారన్నారు.

ఎన్టీఆర్‌లా చంద్రబాబు ప్రజల్లో నుండి పుట్టిన నేత ఏమాత్రం కాదన్నారు. అవిశ్వాస తీర్మానం సమయంలో టిడిపిని కాదని ప్రజల పక్షం నిలబడిన ఎమ్మెల్యేల గురించి చంద్రబాబు నీచంగా మాట్లాడుతున్నారని, ఆ ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోయారని, ప్రలోభాలకు లొంగిపోయారని నోటీకి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో అవసరమైతే ఎన్టీఆర్ పైన పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి, అధికారం ఊడగానే, పదవీ వ్యామోహంతో ఆ పార్టీని వదిలేసి టిడిపిలో చేరిన చరిత్ర నీదని ధ్వజమెత్తారు.

టిడిపి చంద్రబాబు పార్టీ కాదని, ఎన్టీఆర్ వద్ద నుండి లాక్కున్న పార్టీ అన్నారు. టిడిపిని కాంగ్రెసుకు హోల్ సేల్‌గా కాంగ్రెసుకు తాకట్టు పెట్టారని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పుట్టినప్పటి నుండి తమకు అండగా నిలబడిన ప్రతి ఎమ్మెల్యే కూడా పదవులను త్యాగం చేయడానికి సిద్దపడి వచ్చిన వారే అన్నారు.

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy 
 
 sister Sharmila alleged that TDP chief Nara 
 
 Chandrababu Naidu is supporting Kiran Kumar Reddy 
 
 government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X